తీన్మార్‌ మల్లన్నపై డీజీపీకి మహిళా న్యాయవాది ఫిర్యాదు

60
408

వీన్‌ అలియాస్‌ తీన్మార్‌ మల్లన్నపై డీజీపీ మహేందర్‌రెడ్డికి హైకోర్టు న్యాయవాది అరుణ కుమారి ఫిర్యా దు చేశారు. నిర్భయ చట్టం నిబంధనలు పాటించకుండా మల్లన్న ఓ బాధితురాలిని ఇంటర్వ్యూ చేశారని, పోలీసుల విషయంలోనూ బాధ్యత లేకుండా మాట్లాడారని ఆమె ఆరోపించారు. మహిళల విలువలు దిగ జార్చేలా ప్రవర్తించిన మల్లన్నపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.

తీన్మార్ మల్లన్న Q News పేరు తో యూట్యూబ్‌ చానల్‌ నడుపుతున్నాడు. ఇష్టానుసారంగా వ్యాఖ్య లు చేస్తున్న మల్లన్నపై చర్యలు తీ సుకోవాలని న్యాయవాది అరుణ కుమారి తన ఫిర్యాదులో పేర్కొన్నా రు. డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు సమర్పించిన తరువాత మీడియా ప్రకటన విడుదల చేశారు. పంజా గుట్ట కేసులో ఓ మహిళను ఇంటర్వ్యూ చేసిన తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ నవీన్‌ అన్ని రకాల హద్దులు దాటాడని ప్రకటనలో అరుణ కుమారి ఆరోపించారు.

తీన్మార్ మల్లన్న తన ఇంటర్వ్యూలో సభ్యసమాజం తలదించుకునే విధంగా బాధితురాలికి ప్రశ్నలు వేశాడని ఆమె మండిపడ్డారు. 139 మంది నిందితుల కోసం 139 బుల్లెట్లు రెడీ చేసుకోవాలని సిటీ కమిషనర్‌కు ఆదేశాలివ్వడం ఏంటని, అతను సైకోలా ప్రవర్తిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా గతేడాది జరిగిన ‘దిశ’ ఎన్‌కౌంటర్‌ ఫేక్‌ అంటూ మల్లన్న వ్యాఖ్యానించడంపై ఆమె అభ్యంతరం తెలిపారు. ఈ విషయంలో నవీన్‌ సుప్రీంకోర్టుతో పాటు ‘నిర్భయ’ చట్ట నిబంధనలను అతిక్రమించాడని, అతడిపై తగినచర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అభ్యంతరకర వీడియోలు పెడుతున్నారన్న ఆరోపణలపై గతంలో కూడా మల్లన్నపై కేసులు నమోదయ్యాయి. తాజా ఫిర్యాదుపై డీజీపీ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి.

60 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here