జరీనాకు కోవిడ్ పాజిటివ్..సీక్రెట్ గా చికిత్స..!

0
168

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ హిందీ నటి జరీనా వాహబ్ కోవిడ్ -19 బారినపడ్డారు. తీవ్రమైన కోవిడ్ లక్షణాలతో గత వారం ముంబై లీలవతి ఆసుపత్రిలో చేరారు. ఈ విషయం ఆలస్యంగా తెలిసింది. ఊపిరి ఆడకపోవడంతో ఆమెను ఐదు రోజుల పాటు ఆక్సిజన్ సపోర్ట్‌లో ఉంచారు. అయితే వెంటిలేటర్ వరకు వెళ్లక ముందే ఆమె స్పందించింది.

ఈ విషయం బయటకు తెలియకూడదని జరీనా కుటుంబం కోరుకుంది. దాంతో ఆమె ఆస్పత్రిలో చేరిన విషయం ఎవరికీ తెలియలేదు. సన్నిహితులు, కొద్ది మంది కుటుంబ సభ్యులకు మాత్రమే ఈ విషయం తెలుసు. లీలవతి ఆసుపత్రికి చెందిన డాక్టర్ జలీల్ పార్కర్ ఈ వార్తను ధృవీకరించారు ’జరీనాకు కీళ్ళ నొప్పి, ఒంటి నొప్పి, అలసట, జ్వరం తో ఆస్పత్రిలో చేరింది. అప్పుడు ఆమె ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉంది. ” తరువాత ఐదు రోజులకు ఆమెను డిశ్చార్జ్ చేశామని, ఇప్పుడు చాలా బాగుందని చెప్పారు.

ప్రస్తుతం జరీనా తన ఇంట్లో ఏకాంతంలో ఉంటున్నారు. అయితే ఆమెకు ఇప్పుడు నెగెటివ్ వచ్చిందో రాదో తెలియదు. ఇదిలావుంటే, దిషా సాలియన్ మరణంతో జరీనా కుమారుడు సూరజ్ పంచోలి పేరును లింకుపెట్టారు. అయితే ఈ ఆరోపణలను ఆమె కొట్టి పారేసింది.

దిశా.. సూరజ్ స్నేహితురాలు అలాగే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి ముందు రోజు రాత్రి అతడికి సూరజ్ పార్టీ ఇచ్చాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై జరీనా స్పందిస్తూ ..నిజం ఖచ్చితంగా బయటకు రావాలి , దోషులకు నూటికి నూరు శాతం శిక్ష పడాల్సిందేనని అన్నారు. జరీనా వాహబ్ ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆదిత్య పంచోలీ భార్య.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here