వెండితెర మడోన్నాఎవరు?

0
163

మెటేరియల్ గాళ్ మడోన్నా జీవిత కథ తెరకెక్కబోతోంది. అయితే ఆమె బయోపిక్ ని ఏ ప్రఖ్యాత హాలీవుడ్ డైరెక్టరో తీస్తున్నారంటే మీరు తప్పులో కాలేసినట్టే. ఈ సినిమాను డైరెక్ట్ చేసేది వేరెవరో కాదు..ఆమే.

మడోన్నా బయోపిక్ పై వెస్ట్రన్ మీడియాలో కొద్ది రోజులుగా చర్చ నడుస్తోంది. కాని డైరెక్టర్ ఎవరన్నది సస్పెన్స్ గా మారింది. అయితే ‘నా కథను నాకంటే ఎవరు బాగా చెప్పగలరు? అంటూ తన బయోపిక్‌ను తానే డైరెక్ట్‌ చేసుకుంటానని తాజాగా తేల్చేసింది. ఈ సినిమా ఫోకస్‌ మొత్తం మ్యూజిక్‌ మీదే ఉంటుంది. సంగీతమే నన్ను నడిపించింది. నా జీవితంలో ఎన్నో సంఘటనలను ఈ సినిమాలో ప్రస్తావిస్తానని అం టున్నారీ సుప్రసిద్ధ పాప్ గాయని.

దర్శకత్వం వరకు బాగానే ఉంది మరి ఆ పాత్రను ఎవరు పోషిస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశం. ప్రైమ్ ‌టైమ్ ఎమ్మీ విజేత ఓజార్క్ నటి జూలియా గార్నర్‌ ని ఆమె సంప్రదించినట్లు అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. మడోన్నా, ఆమె మేనేజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో 26 ఏళ్ల గార్నర్ ని ఫాలో కావటమే ఈ అనుమా నాలకు కారణం.

ఇక ఈ జాబితాలో ఉన్న మరో పేరు మిలే సైరస్. ఈమె పోలికలు అచ్చుగుద్దినట్టు మడోన్నాలనే ఉంటుంది. అందుకే మడోన్నా తన బయోపిక్ కు ఈమెను ఎంపిక చేసుకోవాలన్నది ఆమె అభిమానుల కోరిక. అయితే రూపు రేకలు మత్రమే పోలితే సరిపోదు. వెండితెరపై మడొన్నాలా జీవించాలంటే లేడీ గాగా అయితేనే కరెక్ట్ అంటున్నారు ఇంకొందరు. అంతే కాదు మడోన్నా బయోపిక్ కు ఆస్కార్లను తెచ్చిపెట్టే సత్తా ఆమెకు ఉంది.వీరితో పాటు కింగ్ ఆఫ్ పాప్ మైఖేల్ జాక్సన్ కూతురు పారిస్ జాక్పన్ పరు కూడా వినిపిస్తోంది.

సినిమా దర్శకత్తం మడొన్నాకు కొత్తేమీ కాదు. గతంలో ‘ఫిల్త్‌ అండ్‌ విస్‌డమ్, డబ్ల్యూ ఈ’ చిత్రాలకు దర్శకత్వ బాధ్యతలు చూశారామె. అంతేకాదు ఆమెకు పుస్తకాలు రాసే అలవాటు కూడా ఉంది.1992లో మడొన్నా రాసిన ‘సెక్ప్’ పుస్తకం అప్పట్లో ఓ సంచలనం.

ఇదిలావుంటే, 62 ఏళ్ల మడోన్నా ఇటీవల తన కవల కుమార్తెలు స్టెల్లా,ఎస్టెరేల ఎనిమిదవ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపింది. ఈ సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులు ఇంట్లో డ్యాన్స్ పార్టీ చేసుకుంటున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here