వాల్‌మార్ట్‌ చేతికి టిక్ టాక్..?

62
355

బహుళ ప్రాచుర్యం పొందిన టిక్ టాక్ పై అమెరికాలో నిషేదం నీడలు కమ్ముకున్నాయి. టిక్ టాక్ జాతీయ భత్రతకు ముప్పుగా అమెరికా బావిస్తోంది. అమెరికా వినియోగదారుల సమాచారాన్ని టిక్‌టాక్‌ సంస్థ చైనా ప్రభుత్వానికి చేరవేస్తోందన్నది అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న వాదన. ఈ నేపథ్యంలో వెంటనే అమెరికాలో టిక్‌టాక్‌ కార్యకలాపాలు విక్రయించాలని, లేదంటే నిషేధం తప్పదని అమెరికా అధ్యక్షడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల హెచ్చరించిన సంగతి తెలిసిందే.. అంతేకాదు టిక్‌టాక్‌ను విక్రయించేందుకు సెప్టెంబర్‌ 15 వరకు గడువును కూడా విధించారు. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్‌తో కలిసి టిక్‌టాక్‌ను కొనుగోలు చేసేందుకు దిగ్గజ సంస్థ వాల్‌మార్ట్‌ సిద్ధమైంది. అందుకు సమాలోచనలు జరుపుతున్నట్లు వాల్‌మార్ట్‌ అధికారికంగా ప్రకటించింది. మైక్రోసాఫ్ట్‌, టిక్‌టాక్‌తో చేసుకోనున్న ఈ ఒప్పందంతో తమ అడ్వర్‌టైజింగ్‌ వ్యాపారాన్ని మరింత పెంచుకోవడానికి దోహదం చేస్తుందని వాల్‌మార్ట్‌ భావిస్తోంది. అయితే వాల్‌మార్ట్‌ ప్రకటనపై మైక్రోసాఫ్ట్‌ కానీ, టిక్‌టాక్‌ కానీ ఇప్పటి వరకు స్పందించలేదు.

62 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here