ఐదు వేల చీరలో అమ్మడు అదుర్ప్

0
118

డవాళ్లకు చీరలంటే పిచ్చి..ఇది కామన్. అలాగే చీరలంటే బాగా ఇష్టపడే బాలీవుడ్ తారల్లో విద్యా బాలన్ ముందుంటారు. చీర కట్టుకు ఆమె ఫేమస్. తనకు ఎలాంటి చీరలు నప్పుతాయో ఆమెకు బాగా తెలుసు. తాజాగా ఆమె చీర కట్టులో ఉన్న ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

సాదా సీదా చీరల్లో కూడా విద్యా బాలన్ మెరిసిపోతోంది. తాజాగా అందమైన బూడిద బూడిద చందేరి సిల్క్ చీర కట్టుకున్న చిత్రాలను ఇన్‌స్టా లో షేర్ చేసింది. చీర అంతా బంగారు ఆకృతులు, దానికి సరిపోయే బార్డర్ ఈ శారీ స్పెషాల్టీ. చీరకు మ్యాచ్ అయ్యే బూడిద రంగు సిల్క్ జాకెట్టులో విద్యా బాలన్ ఫోజు అదిరిందంటున్నారు నెటిజన్లు.

సినిమా స్టార్లు అనగానే ఎంతో ఖరీదైన చీరలు కట్టుకుంటారనుకుంటారు. చాలా మంది తారల విషయంలో అది నిజమే కావచ్చు. కానీ విద్యాబాలన్ మాత్రం చాలా వరకు సింపుల్ చీరలే ఇష్టపడుతుంది. ఆమె చీర కడితే చీరకే అందం వస్తుందంటారు. ఇంతకూ ఈమె కట్టుకున్న ఈ బూడిద రంగు సిల్క్ చీర ఖరీదు కేవలం 5000 రూపాయలే!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here