ఇక టామాటా పావుకిలో పాతిక …

0
123


రాష్ట్రంలో కూరగాయల రేట్లు భగ్గుమంటున్నాయి. ఏది ముట్టుకున్నాకిలో 60 , 70 రూపాయలకు తక్కువలేదు. సామాన్యుడికి ఎప్పుడూ కాస్తో కూస్తో అందుబాటులో ఉండే టామాటా కూడా ఇప్పడు అందకుండా పోయింది. కేవలం వారం పదిరోజుల్లోనే టమాటా ధర 30 రూపాయలు పెరిగింది. ఇప్పడు మార్కెట్లో అది కిలో 60 రూపాయ లు దాటేసింది. వర్షాలకు పంటలు దెబ్బతినటం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. అసలే తెలంగాణలో టమాటా సాగు తక్కువ. దానికి తోడు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమ తులు ఘోరంగా పడిపోయాయి. కొత్త పంట చేతికొచ్చే వరకు టమాటా ధర దిగొచ్చే అవకాశమే లేదు. కొత్త పంట రావాలంటే మరో నెలా నెల పదిహేను రోజులు పడు తుంది.

దీనంతటికి మూల కారణం ఆగస్టులో విపరీతంగా కురిసిన వర్షాలు. మహారాష్ట్ర, తమిళనాడుల్లో భారీ వర్షాల కారణంగా టమాటా పంట దెబ్బతిన్నది. తమిళనాడు చూపు సమీపంలోని మదనపల్లి పై పడింది. అక్కడి దిగుమతి చేసుకుంటుండటం వల్ల డిమాండ్‌ పెరిగింది. తెలంగాణకు సరఫరా తగ్గిపోయింది. గత నెలలో గరిష్టంగా రోజుకు 3 వేల క్వింటాళ్ల వరకు టామటా మార్కెట్లకు రాగా గత 10 రోజులుగా 1,600–2,000 క్వింటాళ్ల మేర మాత్రమే వస్తోంది. దీంతో టమాటా ధరలు అమాంతం ఎగబాకాయి.

ప్రస్తుతం మదనపల్లిలోనే కిలో టమాటా ధర రూ. 30–35 మేర ఉంది. రవాణా చార్జీలు కలుపుకొని ప్రస్తుతం హైదరాబాద్‌ హోల్‌సేల్‌ మార్కెట్‌లో కిలో రూ. 37–40 అమ్ముతున్నారు. రైతు బజార్‌లలో రూ. 45 వరకు అమ్ముతుండగా బహిరంగ మార్కెట్‌కు వచ్చే సరికి ధర రూ. 50–60 వరకు చేరుతోంది. గతేడాది ఇదే సమయానికి కిలో ధర కేవలం రూ. 20 మాత్రమే ఉండగా సరఫరా రోజుకు 3,500 క్వింటాళ్లకుపైగా ఉండేది. అక్టోబర్‌ చివర, నవంబర్‌లో స్థానికంగా పండించే పంట చేతికొస్తుందని, అప్పటివరకు టమాటా ధర తగ్గుదల ఉండదని మార్కెటింగ్‌ శాఖ అధికారులు చెబుతున్నారు.

హైదరాబాద్ వంటి నగరాల్లో పరిస్థితి ఇలా వుంటే…గ్రామాల్లో టమాటా ధర మరీ కొండెక్కింది. ఆగస్టులోనే టోకు వ్యాపారులు కిలో 50 రూపాయలకు తక్కువ అమ్మలేదు. ఇక ఇప్పడు కిలో 70 , 80 రూపాయాలకు తక్కువ అమ్మరు. పావు కిలో అయితే ఈజీగా పాతిక లాగేస్తారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here