పెద్ద‌పులి దాడిలో మ‌హిళ మృతి

73
408

త‌మిళ‌నాడులోని ముదుమలై పులుల సంర‌క్ష‌ణ కేంద్రంలోని మసిన్‌కుడి అటవీ ప్రాంతంలో ప‌శువుల మేపేందుకు వెళ్లిన మ‌హిళ‌పై పెద్ద‌పులి దాడి చేసింది. ఈ దాడిలో మ‌హిళ అక్క‌డిక‌క్క‌డే మృతిచెందింది. ముదుమలై పులుల సంర‌క్ష‌ణ కేంద్రంలో ఏనుగులు, పులులు, చిరుత పులులు, అడవి దున్నలు సహా పలు జంతువులు ఉన్నాయి. అయితే, ఈ సంర‌క్ష‌ణ కేంద్రం ప‌రిస‌ర‌ గ్రామాల ప్రజలు తమ పశువులు, మేకలను మేత కోసం అట‌వీ ప్రాంతంలోకి తీసుకెళ్తుంటారు.
ఈ నేఫథ్యంలోనే కురబంపాడి గ్రామానికి చెందిన 50 ఏండ్ల‌ మహిళ పశువులను మేతకు తీసుకెళ్లింది. ఆ సమయంలో అక్క‌డే మాటువేసిన పెద్ద‌పులి ఆమెపై దాడిచేయ‌గా.. అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న అటవీ, రెవెన్యూశాఖ అధికారులు అక్కడికి చేరుకొని పులిదాడి జ‌రిగిన ప్రాంతాన్ని ప‌రిశీలించారు. అనంత‌రం ఆ ప్రాంతంలో 10 అత్యాధునిక కెమెరాలు ఏర్పాటు చేసి పులి జాడ కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు.

73 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here