డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మరొకరి థీసిస్ ని దొంగిలించారా…?

1
185

ఇవాళ దేశమంతా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్నే ఉపాధ్యాయ దినంగా జరుపుకుంటున్నాము. కానీ ఇలా జరుపుకోవటం ఉపాధ్యాయులకు గౌరవం కాదు..నిజానికి వారికి అది చిన్నతనం అంటారు ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు ఒషో. దీని గురించి ఏమన్నారో ఆయన మాటల్లోనే..


ఇది జరిగింది…
భారత రాష్ట్రపతులలో డాక్టర్ రాధాకృష్ణన్ ఒకరు. అధ్యక్షుడు కావటానికి ముందు ఆయన వైస్-ఛాన్సలర్, వైస్-ఛాన్సలర్ కావడానికి ముందు ప్రొఫెసర్. ఒక ప్రొఫెసర్, ఒక ఉపాధ్యాయుడు రాష్ట్రపతి అయినందుకు అతని పుట్టినరోజు భారతదేశం అంతటా, ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు – ఉపాధ్యాయ దినంగా జరుపుకుంటున్నారు.

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నా విశ్వవిద్యాలయంలో కూడా గొప్ప వేడుక జరిగింది. ఒక ఉపాధ్యాయుడు దేశ అధ్యక్షుడు కావటం ప్రతి ఉపాధ్యాయునికి కీర్తి, ప్రతి ఉపాధ్యాయునికి గౌరవం అంటూ డాక్టర్ రాధాకృష్ణన్ గురించి వైస్-ఛాన్సలర్ బంగారు మాటలలో మాట్లాడారు. ఆయనతో పాటు ఇతర ప్రముఖ ప్రొఫెసర్లు కూడా మాట్లాడారు.

వారి మాటలు విని నేను ఇక సహించలేకపోయాను. నేను నమ్మదగిన వ్యక్తిని కాదని వారికి తెలుసు. ఆ కారణంతోనే నేను మాట్లాడవలసిన అవసరం లేదన్నారు. నేను చెప్పబోయేది మొత్తానికే భంగం కలిగించవచ్చన్నది వారి భయం. అయినా నేను నిలబడి, “నేను మాట్లాడకుండా ఈ వేడుక పూర్తికాదు” అని అన్నాను. దాంతో పాపం ఆ వైస్-ఛాన్సలర్ ముఖం పాలిపోయింది. వేరే గత్యంతరం లేక నన్ను మాట్లాడటానికి ఆహ్వానించారు.

నేను అన్నాను, “వైస్-ఛాన్సలర్ మొదలుకుని, అందరు డీన్స్ నుండి, సీనియర్ ప్రొఫెసర్లు మీకు చెప్పిన విషయాలు చాలా అసంబద్ధమైనవి. ఒక ఉపాధ్యాయుడు రాజకీయ నాయకుయ్యాడన్నఓ సాధారాణ విషయాన్ని మీరు గమనించలేదా? ఇది అధోకరణం, అది గౌరవం కాదు. ఇలా చేయటం ద్వారా ఒక ఉపాధ్యాయుడు తనను తాను గురువుగా గౌరవంగా చూడడు – అతను దేశ అధ్యక్షుడిగా ఉండాలని కోరుకుంటాడు. అందుకే ఇది ఉపాధ్యాయ దినం కాదు. ఒక అధ్యక్షుడు రాజీనామా చేసి పాఠశాలలో చేరి అక్కడ బోధన ప్రారంభించే రోజును నేను ‘ఉపాధ్యాయుల దినం’ అని పిలుస్తాను. అది నిజమైన ఉపాధ్యాయ దినం అవుతుంది. ఇందులోని తర్కం చాలా సులభం, అతను అధ్యక్షుడిగా ఉండటం కంటే బోధనను గౌరవిస్తాడు, అలాగే బోధనను ఇష్టపడతాడు. ”

నా మాటలకు విద్యార్థులందరూ, జనం మొత్తం చప్పట్లు కొట్టటం చూసి వేదికపై కూర్చున్న వైస్-ఛాన్సలర్, ప్రొఫెసర్లు నా మాటలకు షాక్ అయ్యారు. వారు నాతో ఏకీభవించారు. ఈ కొద్దిమంది ఇడియట్స్ చప్పట్లు కొట్టలేదు. అందరూ చప్పట్లు కొడుతున్నారు చూడటం లేదా మీరు కూడా చప్పట్లు కొట్టండి. లేకపోతే తెలివితక్కువవారుగా కనిపిస్తారని అన్నాను. దాంతో వారు కూడా చప్పట్లు కొట్టి సభికులను ఆశ్చర్యపరిచారు. అది చూసి విద్యార్థులు విద్యార్థులు డ్యాన్స్ లు చేయటం మొదలు పెట్టారు. ఇప్పుడు వేడుక పూర్తయింది; లేకపోతే, ఇది ఏం వేడుక? అన్నాను నేను.

మీరు బ్రిటిష్ ప్రభుత్వానికి సేవ చేస్తున్న వ్యక్తిని ప్రశంసించారు-ఆయన భారతదేశ స్వేచ్ఛ కోసం ఎప్పుడూ పోరాడలేదు. అతను కలకత్తా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్, అంతే కాదు ఆయన ఓ విద్యార్థి థీసిస్ నే దొంగిలించాడు. మొత్తం థీసిస్ నే దొంగిలించాడు. అప్పుడు డాక్టర్ రాధాకృష్ణన్ ఎగ్జామినర్లలో ఒకడు. కాని థీసిస్ చూసే సనిలోనే ఉన్నాంటూ చాలా ఆలస్యం చేశాడు. ఇంతలో, అతను దానిని తన పేరు మీద ఇంగ్లాండ్‌లో ప్రచురించగలిగాడు. అది ప్రచురితమైన తరువాత థీసిస్‌ను విశ్వవిద్యాలయానికి తిరిగి ఇచ్చాడు.

ఆ విద్యార్థి ఒక పేదవాడు. అయినా అతను హైకోర్టుకు వెళ్ళాడు. ఈ కేసు కొన్ని నెలలు హైకోర్టులో ఉంది. దీనిపై రాధాకృష్ణన్ ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాడు. ఎందుకంటే పేజీ పేజీ తరువాత, అధ్యాయం తరువాత అధ్యాయం, పదజాలం సరిగ్గా విద్యార్థి థీసిస్ మాదిరిగానే ఉంటుంది.
“అతని మొత్తం వ్యూహం ఏమిటంటే, ఈ పుస్తకం ఇదివరకే ప్రచురించబడింది; అయితే అతని పుస్తకం ప్రచురించబడటానికి ముందే ఈ థీసిస్ తమకు అందిందని విశ్వవిద్యాలయానికి తెలుసు. దాంతో తనకు శిక్ష తప్పదని ఆయనకు తెలుసు. ఇది చాలా అసహ్యకరమైన విషయం. దాంతో అతను విద్యార్థికి పదివేల రూపాయలు చెల్లించి కోర్టు వెలుపల విషయం సెటిల్ చేసుకున్నాడు. విద్యార్థి పేదవాడు కావటంతో కేసును ఉపసంహరించుకోవడం మంచిదని భావించాడు. దాంతో ఆ కేసు ముగిసిపోయింది.

“ఈ వ్యక్తి వైస్-ఛాన్సలర్ కావడానికి లంచాలు ఉపయోగించాడు, ఈ కేసు గురించి భారతదేశమంతా తెలుసు, అతని లంచం గురించి భారతదేశమంతా తెలుసు. అయినా వారు ఆయనను ఓ రుషి తుల్యుడని ప్రశంసించారు. ఈ ప్రశ్నలను లేవనెత్తినప్పుడు, వారి ముఖాలన్నీ వెల వెల పోయాయి. వైస్-ఛాన్సలర్ తన పక్కన కూర్చున్న వ్యక్తితో ఇలా అన్నాడు, “నేను మొదటి నుంచీ భయపడ్డాను. అందుకే అతనిని మాట్లాడటానికి ఆహ్వానించలేదు. అయితే నేను ఎప్పుడూ అతన్ని సమావేశానికి రాకుండా అడ్డుకోవాలని అనుకోలేదు. “

తరువాత నేను ఇలా అన్నాను, “మీ దగ్గర సమాధానం ఉంటే చెప్పండి. ఈ వ్యక్తి గురువు కాదు, దొంగ. అతను రాజకీయ నాయకుడైతే అది ఉపాధ్యాయుల వృత్తికి ఘనత కాదు, అది ఒక అపకీర్తి. అతనికి ఇంకా ఏమైనా తెలివి ఉంటే, అతను రాజీనామా చేసి మళ్ళీ గురువు కావాలి. ” సమావేశం తరువాత వైస్ చాన్సెలర్ నాతో ఇలా అన్నాడు “ఇది మీకు మంచిది కాదు, వారు ప్రతీకారం తీర్చుకుంటారు” . దానికి నా సమాధానం “ఏ ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నా అందుకు నేను సిద్ధంగా ఉన్నాను, కాని పూర్దిగా అబద్ధాలు చెప్పడానికి నేను సిద్ధంగా లేను”. దానికి ఆయన ” కాని నేను అలా చెప్పలేను. అతను నన్ను ఈ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్‌గా నియమించాడు” అని అన్నారు. అతన్ని వైస్-ఛాన్సలర్‌గా నియమించారు, కాబట్టి ఆయనను ప్రశంసించాలి.
సమాజం మొత్తం ఒక కుట్రలో, సూక్ష్మమైన కపటత్వంతో జీవిస్తుంది. ఒంటరిగా నిలబడటానికి ధైర్యం ఉండాలి. అతను చెప్పింది నిజమే, నన్ను అన్ని రకాల ప్రతీకార పరిస్థితుల్లోకి తీసుకువెళ్లారు. అవి ఇంకా జరుగుతూనే ఉన్నాయి. సమాజం జీవించాలని నిర్ణయించుకున్న కపటత్వంతో రాజీ పడటానికి నేను సిద్ధంగా లేనందున నా జీవితమంతా వారు ప్రతీకారం తీర్చుకుంటారు. కానీ నేను జనసమూహంలో భాగం కానందుకు ఇది నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అలాగే నా ప్రజలు జనసమూహంలో భాగం కావాలని నేను కోరుకోను. మీరు మీ జీవితమంతా త్యాగం చేయవలసి వచ్చినప్పటికీ, బానిసగా ఉండటం కంటే ఇది చాలా ఆనందంగా ఉంటుంది. అచేతనంగా, దొంగ నిద్రపోయే బానిసలకన్నా శిలువ ఎక్కటం ఉత్తమం. అన్నాడు ఒషో.

ఇందులో ఒషో ప్రస్తావించిన విద్యార్థి పేరు జదునాథ్ సిన్హా. మీరట్ కాలేజీలో యువ లెక్చరర్. అద్భుతమైన అకాడెమిక్ ట్రాక్ రికార్డ్ కలిగినవాడు. డాక్టర్ రాధాకృష్ణన్ తన థీసిస్ మొదటి రెండు భాగాలను దొంగతనం చేశారని 1929 జనవరి ఆరోపించాడు. తద్వారా సాహిత్య ప్రపంచంలో ఒక సంచలనాన్ని సృష్టించారు. 1922 నాటి ప్రేమ్‌చంద్ రాయ్‌చంద్ స్టూడెంట్‌షిప్ (పిఆర్‌ఎస్) కోసం కలకత్తా విశ్వవిద్యాలయానికి (సియు) సమర్పించిన ‘ఇండియన్ సైకాలజీ ఆఫ్ పర్సెప్షన్, వాల్యూమ్ I & వాల్యూమ్ II) అనే థీసిస్ సమర్పించాడు. 1922 లో థీసిస్ మొదటి భాగాన్ని, 1923 లో థీసిస్ రెండవ భాగాన్ని సమర్పించాడు. ఈ రెండు భాగాలు పైరసీకి గురయ్యాయని కోర్టుకెక్కాడు జదునాథ్.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here