10 నెలల్లోఆమె కోసం ఎంత ఖర్చు చేశాడు…

1
167

బాలీవుడ్ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసులో తవ్వే కొద్ది కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఆయన చనిపోయి రెండు నెలలకు పైనే అవుతోంది. రోజులు గడుస్తున్న కొద్ది సుశాంత్‌ మృతికి సంబంధించి ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.సుశాంత్‌ రాజ్‌పుత్‌కు చెందిన ఒక బ్యాంక్‌ అకౌంట్‌ లావాదేవీలకు సంబంధించిన స్వతంత్ర ఆర్థిక విశ్లేషణ జరిగింది. ఢిల్లీకి చెందిన ప్రముఖ ఆర్థిక ఫోరెన్సిక్ నిపుణులు నమ్రత కనోడియా సుశాంత్‌ బ్యాంక్ స్టేట్ట్‌మెంట్‌‌లలో ఒకదాన్ని పరిశీలించారు. ఈ డబ్బు ఎక్కువగా ప్రయాణ, వ్యక్తిగత విలాసాలు, చారిటీలకు సహాయం, దాతృత్వం, ఆధ్యాత్మిక కార్యకలాపాల కోసం ఖర్చు చేయబడిందని తెలిపారు. ఇందులో కొంత మొత్తం రియా, ఆమె సోదరుడి కోసం కూడా ఖర్చు చేసినట్లు గుర్తించామన్నారు.


కనోడియా మాట్లాడుతూ.. ‘సుశాంత్‌ బ్యాంక్‌ అకౌంట్‌ను పరిశీలించినప్పుడు వివిధ హెడర్‌ల కింద ఈ ఖర్చులు జరిగినట్లు మా దృష్టికి వచ్చింది. దీనిలో రియా, ఆమె సోదరుడు కూడా ఉన్నారు. గత ఏడాది జనవరి నుండి నవంబర్ వరకు సుశాంత్‌ మొత్తం 4.6 కోట్ల రుపాయాలు ఖర్చు చేశాడు. దానిలో ప్రయాణానికి సుమారు 42 లక్షలు, పవానా (మహారాష్ట్ర) లోని ఒక ఫామ్‌హౌస్‌కు 33 లక్షలు, వ్యక్తిగత విలాసాలకు 1.1 కోటి రుపాయాలు ఖర్చు చేసినట్లు గుర్తించాము’ అని తెలిపారు. ‘ఇక రియా కోసం, ఆమె సోదరుడి కసం 9.5 లక్షల రుపాయాలు ఖర్చు చేశాడు. దీనిలో వారి విమాన టిక్కెట్ల కోసం 1.7 లక్షల రుపాయాలు.. 4.72 లక్షలు రియా సోదరుడి హోటల్‌ ఖర్చుల కోసం.. 3.4 లక్షలు ఆమె షాపింగ్‌, మేకప్‌, ఇతర ఖర్చుల కోసం వాడినట్లు గుర్తించాము’ అన్నారు కనోడియా.
గతంలో ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రియా తాను సుశాంత్‌ డబ్బుతో జీవిస్తున్నాననే వార్తలను ఖండించారు. ‘అతను ఓ స్టార్‌లాగా జీవించడానికి ఇష్టపడేవాడు. తన డబ్బుతో నేను జీవించడం లేదు. మేం ఓ జంటలాగా కలిసి ఉన్నామని’ తెలిపారు. అలానే సుశాంత్‌ చార్టెడ్‌ అకౌంటెంట్‌ సందీప్‌ శ్రీకాంత్‌ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. సుశాంత్,‌ రియాకు గానీ.. ఆమె కుటుంబ సభ్యులకు కానీ భారీ మొత్తంలో అనగా లక్షల రుపాయాలు లావాదేవీలు చేయలేదని తెలిపారు. వేలల్లోనే డబ్బు పంపారన్నాడు. ఒక సారి రియా తల్లి సుశాంత్‌కి 33 వేల రూపాయలు బదిలీ చేసిందన్నాడు. సుశాంత్‌ సినిమా హీరో. దానికి తగ్గట్లే అతని లైఫ్ స్టయిల్ ఉందని తెలిపాడు. ఇక ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ శుక్రవారం రియాను దాదాపు 10 గంటలపాటు ప్రశ్నించింది. త్వరలో ఎంకెన్ని నిజాలు వెలుగు చూస్తాయో చూడాలి.

1 COMMENT

  1. Have you ever heard of second life (sl for short). It is essentially a online game where you can do anything you want. sl is literally my second life (pun intended lol). If you would like to see more you can see these sl authors and blogs

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here