ఏంటా మాటలు..! ఓ మీడియా చానెల్ పై సుప్రీం ఫైర్

60
432

త్రికా స్వేచ్ఛ పేరుతో దేశంలో సామరస్యానికి భంగం కలిగించేలా ఒక వర్గంపై విధ్వేషపూరిత వ్యాఖ్యల ను సహించేది లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నోయిడా కేంద్రంగాపనిచేసే సుదర్శన్ టీవీ వారి ’యూ పీఎస్సీ జీహాద్’ షోని ఇకపై ప్రసారం చేయరాదని ఆదేశించింది. యూపీఎస్సీలో చొరబడటానికి ముస్లిం లు ప్రయత్నిస్తున్నారనటం విధ్వేషంతో కూడినవని , మీడియా స్వేచ్ఛ పేరుతో ఎలా పడితే అలా వ్యవ హరిస్తే కుదరదని హెచ్చరించింది. ఇలాంటి (సుదర్శన్ టీవీ) మీడియా సంస్థలు దేశానికి హానికరమని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

మొదటి నుంచీ ‘సుదర్శన్ టీవీ’ తీరే అంత. మైనార్టీ వ్యతిరేక కథనాలకు పెట్టింది పేరు. ఆ కోవలోనే ఈ మధ్య ‘యూపీఎస్సీ జీహాద్’ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది. ముస్లింలు యూపీఎస్సీ సాధించడం కుట్రగా అభివర్ణించింది. కార్యక్రమం విద్వేశాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నందున ప్రసారాన్ని వెంటనే నిలిపేయాలని ఇద్దరు మాజీ ఐఏఎస్ అధికారులు సుప్రీం కోర్టులో పిటీషన్ వేశారు. దీనిని జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం మంగళవారం విచారించింది. ఈ సందర్భంగా సుదర్శన్ టీవీ సహా మీడియా సంస్థల తీరుపై న్యాయమూర్తులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

టీవీ ఛానెళ్లలో డిబేట్లు జరుగుతోన్న తీరుపై విచారణ బెంచ్ న్యాయమూర్తులలో ఒకరైన ఎంకే జోసెఫ్ అసహనం వ్యక్తం చేశారు. చర్చ సరైన దిశలో సాగకుండా.. యాంకర్ గట్టి గట్టిగా అరుస్తూ.. తనకు వ్యతి రేకంగా మాట్లాడిన ప్యానలిస్టుల నోరుమూయించడం సరికాదన్నారయన. దీన్ని మీడియా స్వేచ్ఛ అను కోవడం ముమ్మాటికీ పొరపాటే అని , మీడియా సంస్థలపై నియంత్రణ కష్టతరమే అయినప్పటికీ.. అవి తమ స్వేచ్ఛను బాధ్యతగా వాడుకోవాల్సిన అవసరం ఉందని జస్టిస్ జోసెఫ్ అభిప్రాయపడ్డారు.

పీఎస్సీ జీహాద్ పేరిట ప్రసారమైన కథనాలు రాజ్యాంగ విరుద్దంగా లేవని, అవసరమైతే సంబంధిం చిన ఆధారాలను కోర్టుకు సమర్పిస్తామని సుదర్శన్ టీవీ తరఫు లాయర్ వాదించగా.. ”యూపీఎస్సీ పరీక్షలో అభ్యర్థులందరూ ఒకే పరీక్ష రాస్తారు.. ఇంటర్వ్యూలు కూడా ఒకేలా ఉంటాయి.. కానీ ఒక వర్గం మాత్రమే యూపీఎస్సీలోకి చొరబడుతోందని మీరు(సుదర్శన్ టీవీ) చెబుతున్న విషయాలు సత్యదూరమైనవి. ప్రజాస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకమైనవి కూడా. తద్వారా మీరు(సుదర్శన్ టీవీ) దేశానికి హాని తలపెడుతున్నారు” అంటూ జస్టిస్ చంద్రచూడ్ మండిపడ్డారు. ఈ వివాదానికి సంబంధించి కేంద్రం, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్, సుదర్శన్ టీవీలకు సుప్రీం నోటీసులు జారీ చేసింది.

గత ఆగస్టులోనే ‘యూపీఎస్సీ జీహాద్’ కార్యక్రమాన్ని నిషేధించాలనే డిమాండ్ వ్యక్తమైనా.. అందుకు కోర్టు నిరాకరించింది. తీరా ‘యూపీఎస్సీ జీహాద్’ ఎపిసోడ్లు ప్రసారం అయిన తర్వాతగానీ అత్యున్నత స్థానం దానిని తప్పుపట్టింది.

60 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here