షేర్ మార్కెట్ పరుగుల వెనక….?

1
123

రోనా దెబ్బకు అన్ని రంగాలు కుదేలయ్యాయి. లాక్ డౌన్ వేళ షేర్ మార్కెట్ కూడా ఘోరంగా పడిపోయింది. కానీ అన్ లాక్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ప్రధాన రంగాలేవీ దాని ప్రభావం నుంచి బయటపడలేదు. ఒక్క స్టాక్ మార్కెట్ తప్ప. మన దేశంలో అన్ లాక్ ప్రక్రియ ప్రారంభం కావటం, అదే సమయంలో పశ్చిమ దేశాల్లో కరోనావైరస్ ప్రభావం కాస్త తగ్గినట్టు కనిపించటంతో భారతీయ స్టాక్ మార్కెట్ సూచీలు పై పైకి వెళుతున్నాయి. స్రస్తుతం సెన్సెక్స్ , నిఫ్టీలు కరోనా వైరస్ ముందు నాటి స్థితికి చేవయ్యాయి. ఇది ఎలా సాధ్యమైంది? షేషేర్‌ మార్కెట్లలో తెలివిగా పెట్టుబడులు పెట్టి తేలికగా లాభాలు సంపాదించుకోవచ్చుననే ఆశాజీవులు తమ దగ్గర ఉన్న సొమ్ముతో షేర్ మార్కెట్లోకి ఎంటరవుతున్నారు. ఇలాంటి వారు మధ్య తరగతిలోనే ఎక్కువ మంది. ఇటీవల కాలంలో దేశ వ్యాప్తంగా దాదాపు 35 లక్షల మంది కొత్తగా షేర్ మార్కెట్లో ప్రవేశించినట్టు లెక్కలు చెబుతున్నాయి. అయితే ఇక్కడ వారికి కొన్ని విషయాలు తెలియాలి్స వుంది. షేర్‌ మార్కెట్‌ లోకి 2020వ సంవత్సరంలో కొత్తగా అడుగు పెట్టిన ..అడుగు పెట్టదలుచుకుంటున్న పెట్టుబడిదారులు ఎంతకాలం షేర్ మార్కెట్ లో తమ పెట్టుబడులను కొనసాగిస్తారన్నది ఇప్పుడు ప్రశ్న.

మార్కెట్లు ఆదాయాన్ని పెంచుతాయి. సంవత్సరాల తరబడి అవి వృద్ధి బాటనే ప్రయాణించాయి. కానీ, వర్తమానం గందరగోళంగా ఉండి, ముందుకు వెళ్లే దారి స్పష్టంగా కనిపించనప్పుడు కూడా, ఆర్భాటపు లాభాల అంచనాలను ప్రదర్శించడం మార్కెట్‌ మానుకోలేకపోతోంది. ఆదాయాలు సహేతుకంగా కనిపించనప్పుడు సందేహించడం, భయపడటం నేర్చుకోవాలి. ఇప్పటికే దీని గురించి ఆలోచిస్తూ ఉంటే ఇది కచ్చితంగా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం. మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకునేలా ఊరించే స్థాయికి ఆర్‌బిఐ వడ్డీ రేట్లను తగ్గించింది. కానీ, చేస్తున్న ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో, చేతికి అందుతున్న జీతం అంతే మొత్తంలో ప్రతి నెలా వస్తుందో రాదో తెలియని ప్రస్తుత స్థితిలో ఎవరైనా ఇంటిని కొనగలరా? కంపెనీల పరిస్థితి కూడా ఇంతే! ప్రస్తుతం వున్నదే మూత పడకుండా చూడటం కష్టంగా మారిన నేపథ్యంలో కొత్త ప్లాంట్లను నిర్మించడానికిగానీ, కొనడానికి గానీ ఏ కంపెనీ ఆసక్తి చూపుతుంది? కాబట్టి వడ్డ్డీరేట్లు తగ్గించడం ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి ఏమాత్రం ఉపయోగపడదు. భవిష్యత్‌ వృద్ధి దృశ్యం అస్పష్టంగా ఉండటానికి ఇది ఒక కారణం.

రిలయన్స్‌ ఇండిస్టీస్‌ ఇప్పుడు ఊపు మీద ఉన్న ఏకైక కంపెనీ! జియో ప్లాట్‌ఫామ్‌లపై జరిగిన వరుస ఒప్పందాలతో ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించే సంజీవనిలా కనిపించి, నిఫ్టీలో ఆశలు రేకెత్తించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మండు వేసవిలో ఒక చుక్క నీరు దాహార్తిని ఎలా తీరుస్తుంది? మిగిలిన కార్పొరేట్‌ ప్రపంచం సంగతేంటి? వాటికి మూలధనమూ లేదు. రుణాలూ అందడం లేదు. చిన్న కంపెనీలు మునిగిపోకుండా ఉండటానికి తమ నిల్వలను వెలికితీసి ఖర్చు చేయాల్సిన స్థితి. ఇలా కొట్టుమిట్టాడుతున్న కార్పొరేట్‌ ప్రపంచమే నిజమైన ఆర్థిక వ్యవస్థను ప్రతిఫలిస్తోంది. ఈ కారణం చేతనే జిడిపి వృద్ధి దశాబ్దాల కనిష్టానికి చేరుకుంది.

మార్కెట్‌లో అడుగు పెట్టిన నాలుగు నెలల్లోనే చిన్న-మిడ్‌కాప్‌ స్టాక్‌ల నుండి 50 నుండి 100 శాతం ఆదాయం వస్తే స్టాక్‌ మార్కెట్‌ ద్వారా సులభంగా డబ్బు సంపాదించవచ్చని అనుకుంటే తప్పేమీ కాదు. అలా అనుకోవడం సహజం కూడా! కానీ, మార్కెట్‌కు కొత్త కాబట్టి దీర్ఘకాలంలో అవి పెట్టిన బాధ గురించి కొత్త వారికి తెలియదు. రెండు పూర్తి సంవత్సరాల కాలం 2018, 2019 లలో 40 నుండి 60 శాతం పతనమై, ఇప్పటికీ 2017 నాటి స్థాయికి చేరుకోకపోతే పెట్టుబడి పెట్టినవారికి ఎంత నష్టం వస్తుందో వారికి అర్ధం కాదు. ఆ స్థితి అనేక కంపెనీలను పాతాళానికి పడేసింది. ఎంతగా అంటే దివాలా తీసిన ఆ షేర్‌లను అమ్మకానికి పెట్టడానికి కూడా వారి వద్ద నగదు లేదు!

మీరే కాదు…అనేక మంది రిటైల్‌ పెట్టుబడిదారులు ఈక్విటీల కొనుగోలు కోసం బారులు తీరిన సమయమిది. రిటైల్‌ విభాగంలో పెద్ద ఎత్తున జరుగుతున్న కొనుగోళ్ల గురించే ఇప్పుడు స్టాక్‌ మార్కెట్‌లో మాట్లాడుకుంటున్నారు. రిటైల్‌లో ఇంత రద్దీ ఎందుకు ఏర్పడింది? చాలా మందికి తెలియని విషయమేమిటంటే ఈ రంగంలో పెద్దన్నలుగా పిలవబడే దేశీయ వ్యవస్థాగత సంస్థలు గడిచిన రెండు, మూడు నెలలుగా తమ స్టాక్‌ను తెగనమ్ముతున్నాయి. వారికి కూడా తెలియని విషయం ఏమిటంటే డైనమిక్‌ ఈక్విటీ ఫండ్స్‌ కలిగి ఉన్న అనేకమంది కూడా తమ షేర్లను ఈ కాలంలోనే వదిలించుకుంటున్నారు. బ్రోకరేజి రుసుం చెల్లించడానికి దీర్ఘకాలిక స్టాక్‌లను అప్పుగా ఇవ్వాలని అడగడం సురక్షితమైనదేనా అని ఇటీవల ఒకరు ప్రశ్నించారు. మార్కెట్‌లో భయం అనే పదానికి అర్ధం లేదని ఇది తెలియచేస్తోంది. కానీ, ఇది మంచిది కాదు!

ఇది కేవలం ఈక్విటీ మార్కెట్ల కథ మాత్రమే కాదు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 6 శాతం వడ్డీ ఇవ్వడమే బ్యాంకులకు కష్టంగా మారిన సమయంలోనే బ్యాంకింగ్‌ ఏతర సంస్థలు 10.5 శాతం ఆకర్షణీయమైన వడ్డీ ఇస్తామని ఎలా చెబుతున్నాయి? తక్కువ ప్రతిఫలాలు వస్తున్న సమయంలో ఇలా అధిక రేట్లకు ఆకర్షితులు కావడం రిస్క్‌ అని ఎక్కువకాలం మార్కెట్‌ లావాదేవీలు నిర్వహిస్తున్నవారికి అర్ధమవుతుంది. కానీ, కొత్తగా వచ్చిన వారికి ఇది డబ్బు సంపాదనకు మంచి అవకాశంగా మాత్రమే కనపడుతుంది. ఈ ఏడాది జరుగుతున్న పరిణామాలను సరైన క్రమంలో విశ్లేషించుకుని, అర్ధం చేసుకోకపోతే భవిష్యత్తులో ఆడాల్సిన ఆటలోనూ తప్పటడుగులు వేసే ప్రమాదమే ఎక్కువ. క్లుప్తంగా చెప్పాలంటే 2020లో చూసే దాని ఆధారంగా పెట్టుబడి మార్గంలో ఎక్కువ దూరం ప్రయాణించలేరు. 2020లో నేర్చుకోబోయే దాని ద్వారానే సంపాదన కోసం చేసే ప్రయాణంలో ముందుకు సాగుతారు. ప్రయాణం సాఫీగా జరగాలంటే మొదటి అడుగులు తడబడకుండా చక్కగా వేయాలి. అవి ఎలా ఉన్నాయో రాబోయేకాలమే తేల్చుతుంది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here