ఊర్మిళ సాఫ్ట్ పోర్న్‌స్టార్..!కంగన కామెంట్స్ పై భగ్గుమన్న బాలీవుడ్ !

77
389

బాలీవుడ్ లో సినిమా షూటింగ్ లు పెద్దగా లేకపోయినా ఒక్క పేరు మాత్రం ఇండస్ట్రీలో మార్మోగిపో తోంది. ఆమే కంగనా రనౌత్. రోజుకో వివాదాస్పద వ్యాఖ్యలతో బాలీవుడ్ జనాలను హడలెత్తిస్తోంది.తా జాగా, నటి ఊర్మిళా మతోంద్కర్‌పై ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలపై బాలీవుడ్ మండిపడుతోంది. ఉర్మి లను స్టాఫ్ట్ పోర్న్‌స్టార్గా అభివర్ణిస్తూ కంగన చేసిన కామెంట్ తీవ్ర ఆగ్రహ జ్వాలలకు కారణమవుతోంది.

పార్లమెంట్ లో బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంపై మాట్లాడిన జయాబచ్చన్ కు ఊర్మిల మద్దతు పలికింది. ఆ సందర్భంలోబాలీవుడ్‌లో డ్రగ్స్ వాడకం గురించి మాట్లాడుతూ. ఈ డ్రగ్స్ సమప్య దేశం మొత్తం ఉందని, మాదక ద్రవ్యాలకు తన సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ కేంద్ర బింధువన్న విషయం కంగనకు తెలుస్తా అని వ్యాఖ్యానించింది.

ఊర్మిళ వ్యాఖ్యలపై కంగన ఫైర్ అయింది. ఓ ఆంగ్ల టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ ఊర్మిళపై అసభ్యకర కామెంట్స్ చేసింది. `ఊర్మిళ ఓ సాఫ్ట్ పోర్న్‌స్టార్. ఈ మాట కఠినంగా ఉండొచ్చు.. కానీ అదే నిజం. ఆమె గొప్ప నటి అని ఎప్పుడూ నిరూపించుకోలేదు. సాఫ్ట్ పోర్న్ తరహా పాత్రలు చేయడం తప్ప ఆమె చేసిందేముంది. అలాంటి ఆమెకు ఎన్నికల్లో టికెట్ రాగా లేనిది, నాకు ఎందుకు రాదంటూ కంగన వ్యాఖ్యానించింది.

కంగన వ్యాఖ్యలపై పలువురు బాలీవుడ్ నటులు ఫైర్ అయ్యారు. స్వర భాస్కర్, అనుభవ్ సిన్హా వంటి బాలీవుడ్ ప్రముఖులు ఊర్మిళకు మద్దతుగా ట్వీట్లు చేశారు. ఊర్మిళ గతంలో నటించిన సినిమాల గురించి ప్రస్తావించారు. స్వరా భాస్కర్, అనుభవ్ సిన్హా ఉర్మిలకు మద్దతుగా ట్వీట్ చేశారు. “ప్రియమైన ఉర్మిలా మాతోండ్కర్ జీ, మసూమ్, చమత్కార్, రంగీలా, జుడై, దౌడ్, సత్య, భూట్, కౌన్, జంగిల్, ప్యార్ తునీ క్యా కియా, తెహ్జీబ్, పింజార్, ఏక్ హసీనా థీ .. వంటి చిత్రాలలో మీ నటన అద్భుతం. మీ డాన్ప్ మంత్రముగ్ధులను చేసింది..! లవ్ యు, ” అని ట్విటర్ లో రాసుకుంది.

చిత్రనిర్మాత అనుభావ్ సిన్హా ఇలా వ్రాశారు, “చాలా అందమైన, సొగసైన, ఉద్వేగభరితమైన, వ్యక్తీకరణ నటీమణులలో మీరూ ఒకరనిచెప్పాలని అనిపించింది. మీకు ప్రేమను పంపుతున్నాను ”

77 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here