ఆదిపురుష్ కు రావణుడు దొరికాడు…ప్రభాస్ సినిమాలో విలన్ సైఫ్

82
476

ప్రభాస్ సినిమాలో సైఫ్ విలన్
అంచనాలు పెంచుతున్న ఆదిపురుష్
ప్రభాస్ రాముడు..రావణుడు సైష్ అలీ ఖాన్
ప్రభాస్ లేకపోతే ఆదిపురుష్ లేదు.. ఓం రౌత్
అందమైన రాక్షసుడు నా మొగుడు ..కరీనా


బాహుబలి ప్రభాస్ తాజా చిత్రం ఆదిపురుష్ రోజుకు అంచనాలను పెంచుంతోంది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్న ఈ సినిమాని టీ సిరీస్ భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమిలో నటీనటులను ఆచితూచి ఎంపికచేస్తున్నట్టు కనపిస్తోంది. ఆదిపురుష్ లో శ్రీరాముడుగా టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రభాస్ రేంజ్ లో శ్రీరాముడి పాత్రకు సరితూగ గల రావణాసురుడు పాత్రను ఎవరు పోషించాలన్నది తేలలేదు. మొదట సంజయ్ దత్ రావణ్ గా నటిస్తున్నారన్న వార్తలు వినిపించాయి. అయితే అవన్నీ ఉత్తి పుకార్లేనని సైఫ్ అలీ ఖాన్ ఎంపికతో తేలిపోయింది. 50 ఏళ్ల సైఫ్ ఇటీవల కాలంలో చాలా విభిన్న పాత్రల్లో కనిపిస్తున్నారు. జవానీ జానేమాన్ లో కాసనోవా తండ్రిగా సూపర్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. ఇక ఓం రౌత్‌ దర్శకత్వంలోనే వచ్చిన ‘తానాజీ : ది అన్‌సంగ్‌ వారియర్‌’లో విలన్‌గా మెప్పించాడు. దీంతో లంకేశుడుగా సైఫ్ అదరగొడతాడనటంలో ఆశ్చర్యం లేదు.


రావణుడిగా సైఫ్‌ అలీఖాన్‌ను ప్రకటించగానే.. ప్రభాస్‌ స్పందించారు. సైఫ్‌తో కలిసి పనిచేయడానికి ఎంతో ఉత్సుకతో ఎదురు చూస్తున్నానని, ఆయన లాంటి గొప్ప నటుడితో తెరపంచుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. తెలుగు, హిందీ భాషల్లో తీస్తున్న ఈ చిత్రాన్ని 3డీలో రూపొందించనున్నారు. అంతేకాకుండా తమిళ, మలయాళ, కన్నడ భాషలతో పాటు ఇతర అంతర్జాతీయ భాషల్లోనూ డబ్‌ చేయనున్నారు. గుల్హన్‌కుమార్‌, టి-సిరీస్‌ ఫిల్మ్స్‌ సమర్పణలో భూషణ్‌కుమార్‌, కిషన్‌కుమార్‌, ఓం రౌత్‌, ప్రసాద్‌ సుతార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. ప్రస్తుతం ప్రభాస్‌ ‘రాధేశ్యామ్‌’లో నటిస్తున్నారు.


ప్రభాస్ లేకపోతే ఆదిపురుష్ లేదు.. ఓం రౌత్
ఆదిపురుష్ లో రాముడి పాత్రకు ప్రభాస్ ఎందుకు ఎంపిక చేశారో డైరెక్టర్ ఓం వివరించారు. రాముడు పాత్రకు ప్రభాస్ పర్ ఫెక్ట్. అతని వ్యక్తిత్వం..ప్రశాంత వదనంతో పాటు ప్రభాస్ కళ్లు లోతుగా ఉంటాయి. తనకు తాను ముందుకు నడిచే తీరు అతనిలో నేను ఆదిపురుషుడిని చూసేలా చేసిందని అన్నారు. ప్రభాస్ కాకపొతే వేరెవరితోనూ ఆ సినిమా చేయలేనని అన్నారు ఓం.
“7000 సంవత్సరాల క్రితం ప్రపంచంలోనే అత్యంత తెలివైన రాక్షసుడు ఉన్నాడు! అని సైఫ్ ని ఉద్దేశించి ప్రభాస్ ట్వీట్ చేశాడు.


అందమైన రాక్షసుడు నా మొగుడు ..కరీనా
“మా ఇతిహాస చిత్రంలో బలమైన విలన్ పాత్ర పోషించడానికి ఒక తెలివైన నటుడు కావాలి. ఈ శక్తివంతమైన పాత్ర పోషణకు సైఫ్ ని మించిన వారెవరున్నారు. వ్యక్తిగతంగా నేను అతనితో కలిసి పనిచేయటాన్ని ప్రతిరోజూ ఆనందిస్తాను. మళ్లీ ఆ ఉత్తేజకరమైన ప్రయాణం కోసం ఎదురు చూస్తున్నాను’ అని ఓం రౌత్ అన్నారు.
చరిత్రలో అత్యంత అందమైన రాక్షసుడిని చూపిస్తున్నారు..అతను నా మొగుడు సైఫ్ అలీ ఖాన్ అని కరీనా కపూర్ ట్వీట్ చేసింది. అన్నీ సక్రమంగా జరిగితే ఈ సినిమా 2022లో విడుదులవుతుంది.

82 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here