హేమంత్ కోసం రోడ్డెక్కిన యువత…చందానగర్ లో ఉద్రిక్తత

0
151

మొన్న ప్రణయ్ ..నిన్న హేమంత్ పరువు హత్యలు తెలుగు ప్రజలను తీవ్రంగా కలచి వేస్తోంది. ప్రేమ పెళ్లి కారణంగా దారుణ హత్యకు గురైన హేమంత్‌కు న్యాయం జరగాలని అతని స్నేహితులు, సన్నిహితులు స్పష్టం చేశారు. హేమంత్‌ నివాసం వద్ద సోమవారం సాయంత్రం వారంతా నిరసన చేపట్టారు. పరువు హత్యలకు వ్యతిరేకంగా ‘జస్టిస్ ఫర్ హేమంత్’ కార్యక్రమం చేపడుతున్నట్టు తెలిపారు. తమకు న్యాయం కావాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా.. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో హేమంత్‌ భార్య అవంతి, సోదరుడు సుమంత్‌, సీపీఐ నారాయణ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here