గందరగోళం మధ్య వ్యవసాయ బిల్లులకు రాజ్య సభ ఆమోదం

1
153

ట్టకేలకు రెండు వ్యవసాయ బిల్లులు రాజ్యసభ ఆమోదం పొందాయి. రైతులకు నష్టం చేకూరుస్తుందని ప్రతిపక్షాలన్నీ ముక్తకంఠంతో మొత్తుకున్నాచివరకు మూజువాణి ఓటుతో ఆమోందింపచేసుకున్నారు. బిల్లులపై ఓటింగ్‌ జరపాలని ప్రతిపక్ష ఎంపీలు ఎంతగా డిమాండ్‌ చేసినప్పటికీ రాజ్యసభ డిఫ్యూటీ ఛైర్మన్‌ పట్టించుకోలేదు.

ఇది వరకే లోక్‌సభలో ఆమోదం పొందిన మూడు వ్యవసాయ బిల్లులను ఆమోదం కోసం ఈ రోజు రాజ్యసభలో చర్చకు పెట్టారు. ప్రతిపక్ష సభ్యులు మాట్లాడిన తర్వాత బిల్లుపై ఓటింగ్‌ పెట్టాలని డిమాండ్‌ చేశారు. వీరిని పట్టించుకోకుండా డిప్యూటీ ఛైర్మన్‌ మూజువాణి ఓటుతో ఆమోదించుకునే ప్రయత్నం చేశారు. దీంతో ప్రతిపక్ష సభ్యులు పోడియం వద్దకు వెళ్లి బిల్లు ప్రతులను చించేశారు. డిప్యూటీ ఛైర్మన్‌ మైక్‌ను కూడా లాక్కునేందుకు యత్నించారు. ఈ గందరగోళం మధ్యే బిల్లులు ఆమోదం పొందినట్లు డిప్యూటీ స్పీకర్‌ ప్రకటించేశాడు.

రైతులకు మేలు జరిగేలా చర్యలు చేపడతామని, వ్యవసాయ సంస్కరణల ఫలితంగా దేశవ్యాప్తంగా రైతు ల ఉత్పత్తులు పెరుగుతాయని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ బిల్లులపై చ ర్చ సందర్భంగా పేర్కొన్నారు. మంత్రి వ్యాఖ్యలను విపక్ష సభ్యులు అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్ష ఎంపీలు నినాదాలు చేశారు.

తృణమూల్‌ కాం‍గ్రెస్‌కు చెందిన ఎంపీ డెరెక్‌ ఓ బ్రెయిన్‌‌ బిల్లు మాసాయిదా ప్రతులు చింపి.. పోడియంపై విసిరారు.టీఎంసీ, ఆమ్‌ఆద్మీ, శిరోమణీ అకాలీదళ్‌ సభ్యులు పోడియం వద్దకు చేరుకుని మైకు‌లు విరగొ ట్టేందుకు ప్రయత్నించారు. దీంతో రాజ్యసభలో విపక్షాల తీరు తీవ్ర గందగోళానికి దారితీసింది. విపక్ష స భ్యుల ఆందోళన మధ్య వ్యవసాయ బిల్లులను సభ ఆమోదం తెలిపిందని ప్రకటించిన డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ సింగ్‌ సభను సోమవారానికి వాయిదా వేశారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here