డబుల్ బెడ్ రూమ్ పర్యటన వెనుక రాజకీయం!

0
139

పార్టీల ఎత్తులకు పై ఎత్తులతో తెలంగాణ రాజకీయాల్లో హీటెక్కుతున్నాయి. మంత్రి తలసాని శ్రీనివాయ్ యాదవ్ సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క ఇంటికి వెళ్లడం.. ఇద్దరూ కలిసి నగరంలో పర్యటిస్తూ ప్రభు త్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించడం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.

తాజా గా, శుక్రవారం రంగారెడ్డిలో మంత్రి తలసాని, భట్టి విక్రమార్క పర్యటన సాగింది. జిల్లాలోని మహే శ్వరం మండలంలో తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో మంఖాల్ గ్రామంలో నిర్మాణం చేపడుతున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సందర్శిం చారు. వీరితో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంత రావు తదితరులు పాల్గొన్నారు. మంఖాల్ గ్రామంలో నిర్మాణం చేపడుతున్న ప్రతి ఒక ఇంటికి తిరుగుతూ నేతలు పరిశీలించారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలో అభివృద్ధికి సంబంధించి బుధవారం శాసనసభలో చర్చ జరుగుతుండగా డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంపై తలసాని, భట్టి మధ్య వాడివేడి సంభాషణ జరిగింది. ప్రతిసారీ ఎన్నికల ముం దు ఇళ్లు ఇస్తామని చెప్పడం ఆనవాయితీ అయిందని, మళ్లీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే ఇళ్లను పం పిణీ చేస్తామంటున్నారని భట్టి అన్నారు. దీనికి స్పందించిన తలసాని.. తాను స్వయంగా భట్టి ఇంటికెళ్లి ఆయన్ను తీసుకొని, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను చూపిస్తానని చెప్పారు.

చెప్పిన విధంగానే గురువారం మంత్రి తలసాని స్వయంగా భట్టి ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి ఇరువు రు నేతలు కలిసి జియాగూడలోని సంజయ్‌నగర్ బల్దియాకాలనీకి వెళ్లి అక్కడ 840 ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. తొలిరోజు దాదాపు 3428 ఇళ్లను నేతలు సందర్శించారు. అయితే లక్ష ఇళ్లు చూపే వరకు తాను నగరం విడిచి వెళ్లబోనని భట్టి స్పష్టం చేశారు.

మరోవైపు, బీజేపీ చేపట్టిన తెలంగాణ విమోచన దినోత్పవం కార్యక్రమాల నుంచి రాష్ట్ర ప్రజల దృష్టి మళ్లించేందుకే టీఆర్ఎస్ ఈ కొత్త ఎత్తు వేసిందనే ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే భట్టి ఇంటికి మంత్రి తలసాని వెళ్లారనే టాక్ వినిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here