70 వ ఏట అడుగు పెట్టిన ప్రధాని మోడీ

72
580

ప్రధాని నరేంద్ర మోడీ 70 వ ఏట అడుగు పెట్టారు. వివిధ పార్టీల నాయకుల నుంచి జన్మదిన శుభాకాం క్షలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కాంగ్రెస్ నేత రా హుల్ గాంధీ, పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తదితరులు తమ శుభాకాంక్షలు తెలిపారు.

“ప్రధాని మోడీ తన జీవితంలో ప్రతి క్షణం భారతదేశాన్ని బలంగా, సురక్షితంగా, స్వావలంబనగా మార్చడానికి అంకితం చేశారు. ఆయన నాయకత్వంలో దేశానికి సేవ చేయడం నా అదృష్టం. ఆయన ఆయురారోగ్యాలతో నూరేళ్లు జీవించాలని నాతో పాటు దేశ ప్రజలంతా కోరుకుంటున్నారు. ”అని అమిత్ షా హిందీలో ట్వీట్ చేశారు.

“ప్రధాని నరేంద్ర మోడీ జీకి పుట్టినరోజు శుభాకాంక్షలు” అని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తన శుభాకాంక్షలు తెలుపుతూ, పేదలు, అట్టడుగున ఉన్నవారి సాధికారత కోసం ప్రధాని నిబద్ధతతో పనిచేశారని, ఆయన నాయకత్వం నుంచి దేశం ఎంతో ప్రయోజనం పొందిందని అన్నారు.

మంత్రి హర్దీప్ సింగ్ పూరి ట్వీట్ చేస్తూ, “భారతదేశపు ప్రజాదరణ పొందిన మరియు దూరదృష్టి గల ప్రధాని నరేంద్ర మోడీ జి తన 70 వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ దేశంలో చేరాను. అపారమైన స్పష్టత కలిగిన స్థిరమైన నాయకుడు, తన సమగ్ర మరియు స్థిరమైన అభివృద్ధి విధానాల ద్వారా భారతీయుల జీవితాల్లో పరివర్తన కలిగించే మార్పును తీసుకువచ్చాడు. ప్రియమైన ప్రధాని నరేంద్ర మోడీ జికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ఎంపీ కిరెన్ రిజిజు కూడా ట్వీట్ చేశారు.

నేపాల్ సహా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాధి నేతలు ప్రధాని మోడీకి జన్మదిన సందేశం పంపారు. ఫిన్లాండ్ ప్రధాని సానా మారిన్ బుధవారం ప్రధాని మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పీఎంవేకు లేఖ రాశారు.

72 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here