ప్రజల “ఆకాంక్షలను” మహమ్మారి ప్రభావితం చేయలేదన్న ప్రధాని

0
151

కోవిడ్ 19 మహమ్మారి ప్రపంచంలో ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేసిందన్నారు ప్రధాని మోడీ. అమెరికా-ఇండియా స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్ ఫోరం (యుఎస్‌ఐఎస్‌పిఎఫ్) మూడవ వార్షిక నాయకత్వ సదస్సులో ఆయన కీలక ప్రసంగం చేశారు.

“ఇది మన స్థితిస్థాపకత, ప్రజారోగ్య వ్యవస్థ , ఆర్థిక వ్యవస్థను పరీక్షిస్తోంది. మానవ కేంద్రీకృత అభివృద్ధి విధానం కలిగిన కొత్త మానసిక స్థితిని ప్రస్తుత పరిస్థితి కోరుతోంది. కోవిడ్ హBమ్మారి ఎన్నింటినో ప్రభావితం చేసింది కాని ఇది 130 కోట్ల జనాభా కలిగిన భారతీయుల ఆకాంక్షలు, ఆశయాలను ప్రభావితం చేయలేదు. ఇటీవలి నెలల్లో, ఎన్నో సంస్కరణలు వచ్చాయి, అవి వ్యాపారాన్ని సులభతరం చేయటమే గాక రెడ్-టాపిజంని తగ్గించాయి. 130 కోట్ల జనాభాకు తోడు పరిమిత వనరులున్న భారతదేశం ప్రపంచంలో అతి తక్కువ మరణాల (మిలియన్ కు) రేటు గల దేశాల్లో ఒకటి. రికవరీ రేటు కూడా క్రమంగా పెరుగుతోంది. మేము ప్రపంచంలో రెండవ అతిపెద్ద పిపిఇ కిట్ తయారీదారులం. COVID-19తో పాటు వరదలు, రెండు తుఫాన్లు, , మిడుతల దండు దాడులతో పోరాడాము. ఇది ప్రజలను బలోపేతం చేసింది. ఆపత్సమయంలో పేదలను రక్షించాలన్న విషయాన్ని కోవిడ్, లాక్డౌన్ ద్వారా కేంద్రం తెలుసుకుంది. కరోనా వేళ 80 కోట్ల మందికి ప్రభుత్వం అండగా ఉంది. ఇక ప్రపంచ సరఫరా గొలుసులను అభివృద్ధి చేసే నిర్ణయాన్ని కేవలం ఖర్చుల ఆధారంగా మాత్రమే తీసుకోరాదని ఈ మహమ్మారి ప్రపంచానికి చూపించింది. అలాంటి నిర్ణయాలు నమ్మకం మీద ఆధారపడి ఉండాలి. భౌగోళిక స్థోమతతో పాటు, విశ్వసనీయత ,విధాన స్థిరత్వం కోసం కూడా కంపెనీలు ఇప్పుడు చూస్తున్నాయి’ అని ప్రధాని తన ప్రసంగంలో పేర్కొన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సదస్సులో ప్రధాని ప్రసంగించారు. యుఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరం అనేది లాభాపేక్షలేని సంస్థ, ఇది భారత్ , అమెరికా మధ్య భాగస్వామ్యం కోసం పనిచేస్తుంది. ఆగస్టు 31 న ప్రారంభమైన ఈ ఐదు రోజుల సదస్సు థీమ్ “యుఎస్-ఇండియా నావిగేటింగ్ న్యూ ఛాలెంజెస్”.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here