టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై మళ్లీ చర్చ ?.. బాలీవుడ్, శాండల్ వుడ్ లో కలకలం

1
218
Old film projector with dramatic lighting

బాలీవుడ్‌ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసు విచారణలో డ్రగ్స్ మాఫియా పాత్ర తెరపైకి వచ్చింది. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో దర్యాప్తులో బాలీవుడ్ లో డ్రగ్స్ లింకులన్నీ బయటికి వస్తున్నాయి.ముంబైలో డ్రగ్స్‌ మాఫియాతో బాలీవుడ్ హీరోలకు, రాజకీయ నేతలకు లింకులు ఉన్నాయనే విషయం రియా చక్రవర్తిని విచారిస్తుండగా బయటపడింది. కన్నడ సినీ పరిశ్రమలోనూ మాదక ద్రవ్యాల దందా జోరుగా జరుగుతున్నట్లు వెలుగుచూసింది. శాండల్ వుడ్ లోని ప్రముఖ కన్నడ నటులు, సంగీత దర్శకులకు డ్రగ్ సప్లయిర్లతో సంబంధాలున్నాయనే విషయం బహిర్గతమైంది. బాలీవుడ్, శాండల్ వుడ్ లో డ్రగ్స్ మాఫియా లింకులతో .. మూడేళ్ల క్రితం టాలీవుడ్ లో సంచలనం స్పష్టించిన డ్రగ్స్ కేసు అంశంపై మళ్లీ చర్చ జరుగుతోంది.


2017లో టాలీవుడ్‌ను ఓ కుదుపు కుదుపేసింది డ్రగ్స్ కేసు. ఈ కేసులో పలువురు ప్రముఖులు సహా మొత్తం 62 మందిని సిట్ విచారించింది. కొందరు సినీ ప్రముఖులకు డ్రగ్స్ మాఫియాతో లింకులు ఉన్నాయని అప్పుడు ప్రచారం జరిగింది. సిట్ అధికారుల విచారణ కూడా సంచలనం స్ఫష్టించింది. కేసు విచారణ నిమిత్తం సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుల గోర్లు, వెంట్రుకల నమూనాలను సిట్ సేకరించింది. అయితే వాటి ఫలితాల వివరాలను మాత్రం వెల్లడించలేదు. సుదీర్ఘ విచారణ తర్వాత డ్రగ్స్ కేసులో సిట్ నాలుగు చార్జిషీట్లు దాఖలు చేసిస సిట్.. టాలీవుడ్ సెలబ్రిటీలకు క్లీన్ చిట్ ఇచ్చింది . డ్రగ్స్ కేసులో సినీ సెలబ్రిటీలు నిందితులు కాదని.. బాధితులే అని తేల్చింది. మొత్తం 12 కేసులు నమోదు చేసిన సిట్.. డ్రగ్స్ సరఫరాదారులు, రవాణా చేసిన వారిని మాత్రమే కేసుల్లో చేర్చింది. ఒక చార్జిషీట్‌లో సౌతాఫ్రికాకు చెందిన రఫెల్ అలెక్స్ విక్టర్ పేరు ప్రస్తావించింది. అతడు ముంబై నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ తీసుకువచ్చి అమ్ముతున్నట్లు పోలీసులు తేల్చారు.


డ్రగ్స్ కేసులో సినీ ఇండస్ట్రీకి చెందిన వారికి క్లీన్ చిట్ ఇవ్వటంపై అప్పట్లోనే పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు.డ్రగ్స్ సరఫరా చేసే వ్యక్తి, ఈవెంట్ మేనేజర్‌పైన మాత్రమే కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వ పెద్దల జోక్యం వల్లే కేసుతో లింకులున్న సినీ ప్రముఖుల పేర్లను చార్జీ షీట్ నుంచి తప్పించారని కొందరు ఆరోపించారు. డ్రగ్స్ ఉపయోగించిన వారు కూడా నేరస్తులేనని.. అయినా వారిపై ఎక్కడా చార్జిషీట్ దాఖలు చేయలేదని ప్రశ్నించారు. ఇప్పుడు బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులకు డ్రగ్స్ మాఫియాతో లింకులు ఉన్నట్లు బయటపడుతుండటంతో .. టాలీవుడ్ కేసును మళ్లీ విచారించాలనే చర్చ వస్తోంది. టాలీవుడ్ లోనూ డ్రగ్స్ వినియోగం భారీగా ఉందని, సమగ్ర దర్యాప్తు జరిపితే అంతా బయటికి వస్తారని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ముంబై, బెంగళూరులో జరుగుతున్న నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో తనిఖీలు టాలీవుడ్ ను షేక్ చేస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లోనూ దర్యాప్తు చేస్తే మరిన్ని డ్రగ్స్ మాఫియా లింకులు బయటపడతాయని చెబుతున్నారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here