డీన్ జోన్స్…ఆకస్మాత్తుగా ఆటకు గుడ్ బై చెప్పిన వన్డే లెజెండ్

3
229


ఆటలో అయినా ఆటగాళ్లపై విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. అందునా క్రికెట్ అంటే ఇంకా. ప్రెషర్ ని అధిగమించి ఆడి జట్టును విజయ తీరాలకు చేర్చే స్కిల్స్ ఉన్నఆటగాళ్లు కొద్ది మందే ఉంటారు. ఆ బహుకొద్ది మందిలో డీన్ జోన్స్ ముందు వరుసలో ఉంటారు.

డీన్ జోన్స్ క్రికెట్ కెరీర్ దశాబ్ద కాలం మాత్రమే సాగింది. అయినా ఇంటర్పేషన్ క్రికెట్ పై చెరగని ముద్ర వేశారు. ముఖ్యంగా వన్డే ఆటపై.. వన్డే రిటైర్మెంట్ కు రెండేళ్ల ముందే ఆయన టెస్టులకు గుడ్ బై చెప్పారు. అయితే వన్డే కెరీర్ నుంచి ఆయన నిష్క్రమణ అకస్మాత్తుగా ఎవరూ ఊహించని రీతిలో జరిగింది. అది ఎలాగో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వివరించారాయన.

అప్పటికే టెస్టులకు గుడ్ బై చెప్పిన 33 ఏళ్ల డీన్ జోన్స్ కు 1994లో దక్షిణాఫ్రికాతో జరిగిన ఎనిమిది మ్యాచ్ల వన్డే సిరీస్‌ కు పిలుపు వచ్చింది. కానీ సిరీస్ చివరి మ్యాచ్ కంటే ముందు అతనిని చివరి పదకొండు మంది నుంచి తప్పించారు. ” నేను దక్షిణాఫ్రికాలో ఉన్నాను, వారు నన్ను ఆ పర్యటనకు ఎంచుకున్నారు, ఆపై వారు నన్ను వన్డే జట్టు నుండి తొలగించారు,” అని చెప్పాడు. ” సిరీస్ 3-3 (4-3), మేము చివరి మ్యాచ్ ఆడుతున్నాము, అంతా బాగానే ఉంది. అయితే నాకంటే ముందు మార్క్ టేలర్ , డేవిడ్ బూన్ ను ఎంచుకున్నారు.’’ “నేనన్నాను… ‘ మీరు వన్డే క్రికెట్‌లో నాకన్నా మంచి ఆటగాడని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారా? అయితే సరే అని వెంటనే రిటైర్ అయ్యాను. అదీ జరిగింది’’. తరువాత వారన్నారు ‘లేదు, మీరు ఈ వన్డే సిరీస్ అంతా ఆడటానికి షార్జా వెళ్ళవలసి వచ్చింది.’ నేను వెళ్ళడం లేదని తేల్చేశాను.. ఇంక చెప్పేదేమీ లేదు…ధన్యవాదాలు ..అది సంగతి ’’ అని డీన్ జోన్స్ ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.

అలా డీన్ జోన్స్ ఇంటర్నేషనల్ క్రికెట్ కెరీర్ ముగిసింది.ఆ సిరీస్ కు అలెన్ బోర్డర్ సారధి. అప్పుడు ఆస్ట్రేలియా టీమ్ లో మార్క్ టేలర్, డేవిడ్ బూన్, ఇయాన్ హీలీ, స్టీవ్ వా, మార్క్ వా, షేన్ వార్న్ , మెక్ గ్రాత్ , మైఖేల్ స్లేటర్ వంటి మేటి ఆటగాళ్లు ఉన్నారు. ఆ సిరీస్ ని ఆస్ట్రేలియా గెలుచుకుంది. ఏదేమైనా డీన్ జోన్స్ ఓ అరుదైన ఆటగాడిగా క్రికెట్ అభిమానుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతారు. 1987లో ఆస్ర్టేలియా వరల్డ్ కప్ విజయంలో డీన్ జోన్స్ అద్భుత బ్యాటింగ్ , ఫీల్డింగ్ తో కీలక భూమిక పోషించారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here