ఢిల్లీ రాజకీయాల్లేవ్.. ఏం లేవ్… !

0
165

జాతీయ స్థాయిలో కొత్త పార్టీ పెట్టాలన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు షాక్ తగిలింది. కేసీఆర్ తో కలిసి నడిచేందుకు ప్రాంతీయ పార్టీలేవి ముందుకు రాలేదు. తనకు మంచి మిత్రుడిగా ఉన్న వై.ఎస్. జగన్ నుంచి కూడా ఆయనకు మద్దతు లభించలేదు. ఢిల్లీ రాజకీయాలు తుస్సుమనేలా ఉండటంతో కొత్త జాతీయ పార్టీ ఆలోచనే లేదని కొత్త పల్లవి అందుకున్నారు కేసీఆర్.

గతంలోనూ ఫెడరల్ ఫ్రంట్, సెక్యులర్ ఫ్రంట్ ప్రకటనలు చేశారు కేసీఆర్. బీజేపీ పై ఆరోపణలు చేశారు. పార్లమెంట్ లో మాత్రం బీజేపీకి మద్దతుగా నిలిచారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మెజార్టీ బిల్లులకు పార్లమెంట్ లో సపోర్ట్ చేసింది టీఆర్ఎస్. అందుకే ఎప్పుడు ఏ వైఖరి తీసుకుంటారే తెలియని కేసీఆర్ ను ప్రాంతీయ పార్టీల నేతలెవరు నమ్మడం లేదని తెలుస్తోంది .

కాంగ్రెస్, బీజేపీలకు పోటీగా కలసివచ్చే ప్రాంతీయ పార్టీలతో కలిస జాతీయ స్థాయి లో నయా బారత్ పేరుతో కొత్త పార్టీ కోసం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. కొందరు ప్రాంతీయ పార్టీ నేతలతోనూ ఆయన మా ట్లాడినట్లు చెబుతున్నారు. దేశంలో అధ్యక్ష తరహా పాలన, జాతీయ పార్టీలు మాత్ర మే లోక్ సభ ఎన్నికల్లో పోటీచేసేలా నిబంధనల మార్పు కోసం బీజేపీ ప్రయత్ని స్తోందని, దానికి పోటీగా కేసీఆర్ బీజేపీ, కాంగ్రెసేతర శక్తులను కూడగడుతున్నారనే వార్త దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే నయా భారత్ పార్టీ ఏర్పాటుపై ప్రాంతీయ పార్టీల నుంచి కేసీఆర్ సపోర్ట్ లభించలేదని చెబుతున్నారు.

కేసీఆర్ కు ఫ్రెండుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మద్దతు కూడా కేసీఆర్ కు లేదని చెబుతున్నారు. ప్రస్తుతం వైసీపీ చీఫ్ జగన్ కేంద్రంతో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారు. జగన్ పై సీబీఐ, ఈడీ కేసులు కూడా ఉన్నాయి. జాతీయ పార్టీ లకు వ్యతిరేకంగా పోతే ఆయన ఇబ్బందులు వస్తాయనే భయం వైసీపీలో ఉంది. అందుకే జగన్ .. కేంద్రానికి వ్యతిరేకంగా పని చేసే అవకాశాలు ఉండకపోవచ్చని రాజకీయ నిపుణులు అంచనా. టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ, ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా కేసీఆర్ ప్రతిపాదనపై ఇంట్రెస్ట్ చూపించలేదని తెలుస్తోంది.

ఎన్సీపీ. జేఎంఎం పార్టీలు కూడా స్పందించలేదని టీఆర్ఎస్ వర్గాల సమాచారం. మహారాష్ట్రలో ఎన్సీపీ కాంగ్రెస్, శివసేనతో సంకీర్ణ సర్కార్ లో ఉంది. జార్ఖండ్ లో జేఎంఎం, కాంగ్రెస్ కూటమిగా ఉన్నాయి. అందుకే ఆ రెండు పార్టీలు కాంగ్రెస్ కూటమితోనే ఉండాలని నిర్ణయించాయట. ఎస్పీ, బీఎస్పీల అధినేతలతోనూ కొత్త పార్టీ ఏర్పాటుపై మాట్లాడాలని కేసీఆర్ ప్రయత్నించినా వారు అందుబాటులోకి రాలేదని సమాచారం.

తమిళనాడులోని డీఎంకే స్టాండ్ కూడా కాంగ్రెస్ కూటమి వైపే ఉంది. వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రస్తుతం స్టాలిన్ పోకసంతా అసెంబ్లీ పోల్స్ పైనే ఉంది. అవి ముగిశాకే మాట్లాడు తానని కేసీఆర్ కు స్టాలిన్ చెప్పినట్లు చెబుతున్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ తో పాటు మరికొన్ని ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ కూటమిలోనే ఉంటామని స్పష్టం చేశాయట.

జాతీయ పార్టీ ఏర్పాటుపై కేసీఆర్ చేయించిన సర్వేల్లోనూ మంచి ఫలితాలు రాలే దంటున్నారు. దీంతో జాతీయ పార్టీపై కేసీఆర్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికలకు ముందు ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదన తెచ్చారు కేసీఆర్. ఎన్నికలు అయ్యాక దాని సంగతే మర్చిపోయారు. ఇప్పుడు కూడా తన కొడుకును సీఎం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగానే జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నట్లు సీన్ క్రియేట్ చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. కేసీఆర్ కు జా తీయ పార్టీ పెట్టే సీన్ లేదని, రోజుకో స్టాండ్ తీసుకునే ఆయనకు ఎవరూ మద్ద తివ్వరని చెబుతున్నారు. జాతీయ పార్టీ పెడితో కేసీఆర్ జోకర్ గా మారడం ఖాయమంటున్నారు కాంగ్రెస్ నేతలు.

-S.S.Yadav, Senior Journalist

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here