అధిష్టానంతో పెట్టుకుంటే అంతే…

0
169

ధిష్టానంతో ‘పెట్టుకుంటే ఎలా ఉంటుందో కాంగ్రెస్ మరో సారి రుచి చూపించింది. యూపీ సీనియర్ కాంగ్రెస్ నేతలను అదును చూసి దెబ్బ కొట్టారు అధినేత్రి. మరో రెండేళ్లలో జరిగే ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది కాంగ్రెస్ అధిష్టానం. నేపథ్యంలో అధిష్ఠానం ఏడు కమిటీలను ఏర్పాటు చేసింది. సీనియర్ నేతలైన రాజ్ బబ్బర్, జితిన్ ప్రసాదతో పాటు మరి కొందరికి వీటిలో చోటు దక్కలేదు. క్రియాశీల నేత, పూర్తికాలపు అధ్యక్షుడు కావాలంటూ లేఖ రాసి సంతకాలు పెట్టిన 23 మంది నేతలలో వీరిద్దరు కూడా ఉన్నారు. జితిన్ ప్రసాద యూపీఏ హయాంలో కేంద్ర మంత్రి. రాజ్ బబ్బర్ నిన్న మొన్నటి వరకు యూపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా ఉన్నారు. ఏడు కమిటీల్లో ఏ ఒక్క దానిలో కూడా వీరికి చోటు దక్కపోవటాన్ని బట్టి చూస్తే సోనియా వీరిపై ఎంత ఆగ్రహంతో ఉన్నారో అర్థమవుతోంది.

అయితే ఈ పరిణామాన్ని యూపీ కాంగ్రెస్ నేతలు వేరాల బావిస్తున్నారు. వారు ఇప్పటికే అనేక బాద్యతలు నిర్వహిస్తున్నందున అదనపు భారం మోపటం ఇష్టం లేకే వారిని కమిటీలకు దూరంగా పెట్టిందని, అంతకు మించి అధిష్టానిని వారిపై ఏ దురుద్దేశం లేదని పార్టీ నాయకులు కొందరు అంటున్నారు.


ఇది ఇలావుంటే, తాజాగా అధిష్ఠానం మేనిఫెస్టో కమిటీని కూడా ప్రకటించింది. కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ దీనికి నాయకత్వం వహిస్తారు. పి.ఎల్. పూనియా, సుప్రియా శ్రీనాతే, అర్ధానా మిశ్రా, ప్రమోద్ తివారీ, ఇమ్రాన్ మసూద్ తదితరులు ఖుర్షీద్ టీమ్ లో ఉన్నారు. వీరు ఉత్తర ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ మ్యానిఫెస్టోను రూపొందిస్తారు. ఉత్తర ప్రదేశ్‌లో పార్టీ ఇన్‌చార్జిగా ఉన్న ప్రియాంక గాంధీ ఇప్పటికే పలు ఎన్నికల బృందాలను ఏర్పాటు చేయడం ప్రారంభించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.


గత ఏడాది లోక్‌సభ ఎన్నికలకు ముందే ప్రియాంకకు ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను నడిపించే బాధ్యతలు అప్పగించారు. కానీ ఆ ఎన్నకల్లో ఆమె అట్టర్ ఫ్లాప్ అయ్యారు. కేవలం రెండే రెండు సీట్లు గెలిచింది కాంగ్రెస్. రాష్ట్రంలో ఇప్పటివరకు కాంగ్రెస్ చెత్త పర్ఫామెన్స్ అదే. సోనియా గాంధీ రాయ్ బరేలిని నిలుపుకున్నప్పటికీ, బిజెపి స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ అమేథిలో ఘోర పరాజయం చవిచూశారు. రాజకీయాల్లో ఇదంతా సహజం, ఇప్పుడు భవిష్యత్ లోకి చూడటమే ముఖ్యమని భావించి అధిష్టానానికి ఎంతో దగ్గరివాడైన సల్మాన్ ఖుర్ఫీద్ పై పెద్ద బాధ్యతలు పెట్టినట్టు తెలుస్తోంది. .అలీగఢ్ లో జన్మించిన ఖుర్షీద్ ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ లోని ఫరూఖాబాద్ నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహించారు. ఈయన మాజీ రాష్ట్రపతి జాకీర్ హుస్సేన మవనడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here