ఎంపీలకు సెలవులు లేవ్..

0
107

పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాల్లో ఎంపీలకు వారాంత‌పు సెలవుల్లేవు. వారం మొత్తం పార్లమెంట్ స‌భ్యులు సమావేశాలకు హాజరు కావాల్సిందే. శని, ఆదివారాల్లోనూ పార్లమెంట్ సమావేశాలు జ‌రుగుతాయి. ఈ మేరకు పార్లమెంట్ వర్గాలు ఓ సర్క్యులర్‌ను జారీ చేశాయి. కాగా పార్ల‌మెంట్ వ‌ర్షాకాల సమావేశాలు ఈ నెల 14 నుంచి అక్టోబర్ 1 వరకు జ‌రుగుతాయి. అయితే గతంలో మాదిరిగా ఈ సెష‌న్‌లో వారాంత‌పు సెల‌వులు ఉండ‌వు.
కాగా, కరోనా మ‌హ‌మ్మారి విస్త‌ర‌ణ నేపథ్యంలో అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. ఉభ‌య‌స‌భ‌ల స‌మావేశాల‌ను ఒకేసారి కాకుండా ఉద‌యం రాజ్య‌స‌భ స‌మావేశాల‌ను, మ‌ధ్యాహ్నం లోక్‌స‌భ స‌మావేశాల‌ను నిర్వ‌హించ‌నున్నారు. అయితే తొలి రోజైన సెప్టెంబ‌ర్ 14న మాత్రం ఉద‌యం లోక్‌స‌భ‌, మ‌ధ్యాహ్నం రాజ్య‌స‌భ స‌మావేశం కానుంది. ఇక ఈసారి స‌మావేశాల్లో ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యాన్ని కూడా తొల‌గించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here