బాయ్ ఫ్రెండ్..చార్టెడ్ ఫ్లైట్..సొంత ఊరు.. !

0
150

క్షిణాది టాప్ హీరోయిన్ నయనతార తన బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్ తో కలిసి తన సొంత ఊరు కొచ్చి వెళ్లారు, ఆంధ్రులకు సంక్రాంతి ఎలాగో మళయాళీలకు ఓణం అలాంటిది. ఎక్కడ ఉన్నా ఈ పండగకు అంతా తప్పకుండా సొంత ఊళ్లకు వెళ్లి తమ వారితో గడుపుతారు. దీనికి తారలు మినహాయింపు కాదు.
అసలు విషయానికొస్తే.. కొన్నేళ్లుగా నయనతార దర్శకుడు విఘ్నేష్ శివన్ తొ ప్రేమలో ఉంది. ఈ ప్రేమ పక్షులు వీలు చిక్కినప్పుడల్లా హాలిడే కోసం విదేశాలకు చెక్కేస్తుంటారు. వారి విహార యాత్రలకు సంబంధించిన ఫొటోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటాయి. అయితే కరోనా క్రైసిస్ కారణంగా కొన్ని నెలల నుంచి వీరిద్దరూ చెన్నయ్ లోనే ఉన్నారు. అయితే ఓణం పండుగ కోసం ఆమె తన ప్రియుడితో కలిసి చార్టెడ్ ఫ్లైట్ లో కొచ్చి వెళ్లటం బాగా ఫోకస్ అయింది. ప్రత్యేక విమానంలో వీరిద్దరు కొచ్చి చేరుకోవడాన్ని మీడియా హైలైట్ చేసింది.
చార్టెడ్ ఫ్లయిట్‌లో నుంచి దిగిన నయనతార, విఘ్నేష్ శివన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వారిద్దరూ ఫ్లయిట్ దిగి నడుచుకొంటూ వస్తున్న ఫోటో మీడియాలో చక్కర్లు కొడుతున్నది. విఘ్నేష్ ఎరుపు టీషర్టు, బ్లూ జీన్స్‌లో, నయనతార బ్లాక్ డ్రస్‌లో కనిపించారు. నయనతార ప్రస్తుతం ఆర్జే బాలాజీ రూపొందించే మూకుతి అమ్మన్ చిత్రంతోపాటు రజనీకాంత్ అన్నాతే చిత్రంలో నటిస్తున్నారు. అలాగే అవల్ ఫేమ్ డైరెక్టర్ మిలింద్ రావు దర్శకత్వం వహించే నేత్రికమ్ అనే చిత్రంలో నటించడానికి అంగీకరించారు. , విఘ్నేష్ ప్రస్తుతం రెండు చిత్రాలను రూపొందించే పనిలో ఉన్నారు.
నయనతారకు గతంలో కూడా ప్రేమ వ్యవహారాలున్నాయి. అయితే ఆమె తన ఆఫ్ స్క్రీన్ రొమాన్స్ ని ఎప్పుడూ దాచలేదు. ఏవరితో తిరిగినా పబ్లిక్ గానే తిరిగింది. ఇక ప్రభుదేవాతో ఆమె ప్రేమ అప్పట్లో సెన్సేషన్. పెళ్లికోసం ఆమె హిందూ మతాన్ని కూడా స్వీకరించింది. నయనతార ప్రేమలో పడి ప్రభుదేవా తన భార్యకు విడాకులు కూడా ఇచ్చాడు. అదిగో పెళ్లి ఇదిగో పెళ్లి అన్నారు. చివరకు నయనతార హ్యాండివ్వటంతో వారి ప్రేమ పెటాకులైంది. అయితే ఇప్పుడు విఘ్నేష్ తో ఆమె రొమాంటిక్ లవ్ స్టోరీ కూడా దాదాపు అలాగే సాగుతున్నట్టనిపిస్తోంది. ఒక్కటే తేడా ప్రభుదేవాలా విఘ్నేష్ కి వివాహితుడు కాదు. నాలుగేళ్లుగా వారి మధ్య ప్రేమాయణం సాగుతోంది. అదిగో పెళ్లి ఇదిగో పెళ్లి అన్నట్టుగానే ఉంది వారి వ్యవహారం. అయితే ఇప్పుడు నయనతార కెరీర్ పీక్ లో ఉంది..విఘ్నేష్ అగ్ర దర్శకుడుగా ఎదిగే క్రమంలో ఉన్నాడు. అందుకే పెళ్లిని వాయిదా వేస్తుండవచ్చు. అయితేనేం వారు తరచూ చట్టాపట్టాలేసుకుని ఓపెన్ గా కలిసి తిరుగుతున్నారు. పెళ్లికెందుకు తొందర అనుకుంటున్నారు కావచ్చు. అయితే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు.. ప్రభుదేవాతో బ్రేకప్ ని ఎవరైనా ఊహించారా….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here