ఈ అమ్మాయే మహారాష్ర్ట మహిళా టాపర్

94
578

నిన్న విడుదలైన జెఇఇ మెయిన్ సెప్టెంబర్ 2020 ఫలితాల్లో మహారాష్ట్ర అమ్మాయి ఇంద్రయాని టాయ్డే 99.97 శాతం సాధించి టాపర్స్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. మహారాష్ట్ర మహిళా కేటగిరీలో ఆమే టాపర్. నికాలాస్ బ్రాంచ్ కు చెందిన సోమాల్వర్ హైస్కూల్‌లో ఇంద్రాయణి టాపర్. రెండేళ్ల క్రితం ఆమె పాఠశాలలో 10 వ తరగతి టాపర్‌లలో ఒకరు. “నేను ఈ స్కోరుతో చాలా సంతోషంగా ఉన్నాను, ఈ గౌరవాన్ని నేను ఎన్నడూ హించలేదు. రాష్ట్ర మహిళా టాపర్ జాబితాలో చోటు దక్కించుకోవడం చాలా ఆనందంగా ఉంది ” అని ఇంద్రయానీ విలేకరులతో అన్నారు.

మహారాష్ట్రలోని మహిళా టాపర్స్ జాబితాలో తన పేరు ఉన్నసంగతి ఆమె మీడియా ద్వారా తెలుసుకుంది. ఫలితాలు ఉన్న వెబ్‌సైట్ లో ఇబ్బందులు ఎదురవటంతో ఆమె తన రిజల్ట్ ను చూసుకోలేకపోయింది. “నేను సిలబస్‌ను 2019 సెప్టెంబర్‌లోనే పూర్తి చేశాను. ఆ తరువాత, పరీక్ష ప్రిపరేషన్ లో ఉన్నాను, అలాగే ప్రస్తుత నెలకొన్న పరిస్థితుల కారణంగా తలెత్తిన ఒత్తిడిని అధిగమించాను. ” అని తాను పరీక్షలకు ఎలా తయారైందో వివరించారామె.

లాక్డౌన్ వల్ల అభ్యర్థులు ప్రాక్టీస్ చేయాటానికి తగిన సమయం చిక్కిందని ఇంద్రయాణి అన్నారు. ఇంద్రాయణి టీచర్ దిలీప్ వైద్య మాట్లాడుతూ, “ఆమె ఇప్పటికే జెఇఇ మెయిన్ కంటే జెఇఇ అడ్వాన్స్డ్ కోసం ఎక్కువ ప్రాక్టీస్ చేస్తోంది, ఇది ఆమె విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది, ఇప్పుడు అది ఆమె పరీక్ష విశ్లేషణలో చూడొచ్చు” అని అన్నారు.

ఇంద్రాయణి తన చదువులపై అధిక దృష్టి పెట్టిన ప్రతిభావంతులైన విద్యార్థి. ఇప్పటి వరకైతే ఐఐటిలో ప్రవేశానికి అర్హత సాధించాలని కోరుకుంటోంది. ఆమె ఎంచుకోవాలనుకుంటున్న శాఖ గురించి అడిగినప్పుడు, “నేను ఏ ఇంజనీరింగ్ విభాగాన్ని ఎంచుకోవాలన్నదాని గురించి ఇంకా ఆలోచించలేదు.” అని అన్నారు ఇంద్రయాని టాయ్డే.

ఐఐటీ, ఎన్‌ఐటీ తదితర ప్రఖ్యాత ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశానికి ఉద్దేశించిన ‘జేఈఈ మెయిన్స్‌’ ఫలితాలలో 24 మంది విద్యార్థులు 100 పర్సంటైల్‌ సాధించారు. వీరిలో ఎనిమిది మంది తెలంగాణకు చెందిన విద్యార్థులే కావడం విశేషం. ఆ తరువాత స్థానంలో ఐదుగురు విద్యార్థులతో ఢిల్లీ ఉంది. రాజస్తాన్‌ నుంచి నలుగురు, ఆంధ్రప్రదేశ్‌ నుంచి ముగ్గురు, హరియాణా నుంచి ఇద్దరు, గుజరాత్, మహారాష్ట్రల నుంచి ఒక్కరు చొప్పున 100 పర్సంటైల్‌ సాధించారు.కోవిడ్‌–19 కారణంగా రెండు సార్లు వాయిదా పడిన జేఈఈ మెయిన్స్‌ను సెప్టెంబర్‌ 1 నుంచి 6 తేదీల మధ్య, పూర్తి స్థాయిలో కరోనా నిబంధనలను అమలు పరుస్తూ, నిర్వహించారు. జేఈఈ మెయిన్స్‌ కోసం 8.58 లక్షల మంది రిజిస్టర్‌ చేసుకోగా, వారిలో 74% మంది విద్యార్థులు మాత్రమే పరీక్షకు హాజరయ్యారు.

94 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here