పది రోజుల్లో 54 సెం.మీ వర్షపాతం

5
239

త పది రోజుల్లో హైదరాబాద్‌లో 54 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలో హైదరాబా ద్ లో పరిస్థితిన మంత్రి కేటీఆర్ అధికారులతో సమీక్షించారు. తదుపరి చర్యలలో భాగంగా న‌గ‌రంలోని ఓపెన్ నాలాల పైక‌ప్పులు మూసివేయాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

ఈ క్ర‌మంలో న‌గ‌రంలోని అన్ని నాలాల స‌మాచారం సేక‌రించాల‌ని అధికారుల‌కు మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఓపెన్ నాలాల‌పై క్యాపింగ్‌(బాక్స్ డ్రైనేజీల‌) నిర్మాణానికి రూ. 300 కోట్ల‌తో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం చేప‌ట్ట‌బోతున్న‌ట్లు కేటీఆర్ ప్ర‌క‌టించారు. న‌గ‌రంతో పాటు మిగ‌తా మున్సిపాలిటీల్లో కురుస్తున్న వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌పై రాష్ర్ట ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు.

రెండు మీట‌ర్ల క‌న్నా త‌క్కువ వెడ‌ల్పు ఉన్న నాలాల‌పై క్యాపింగ్ నిర్మాణం చేస్తామ‌న్నారు. రెండు మీట‌ర్ల కంటే వెడ‌ల్పు ఉన్న నాలాల‌పై గ్రీన్ ట్రిబ్యున‌ల్‌, సుప్రీంకోర్టు మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు. ఇలాంటి భారీ కార్య‌క్ర‌మాన్ని సాధ్య‌మైనంత త్వ‌ర‌గా పూర్తి చేసేందుకు ప‌క‌డ్బందీగా ప్ర‌ణాళిక‌లు రూపొందించాల‌ని అధికారుల‌ను కేటీఆర్ ఆదేశించారు. క్యాపింగ్ కుద‌ర‌ని నేప‌థ్యంలో వాటికి ప‌క‌డ్బందీగా ఫెన్సింగ్ చేయాల‌ని ఆదేశాలు జారీ చేశారు.

ఇప్ప‌టికే జీహెచ్ఎంసీ ప‌రిధిలోని నాలాల స‌మాచారం సేక‌రించామ‌ని తెలిపారు. న‌గ‌రం విస్త‌రించినందున ఆయా ప్రాంతాల్లో ఉన్న నాలాల స‌మాచారం సేక‌రించాల‌ని జోన‌ల్ క‌మిష‌న‌ర్లు, డిప్యూటీ క‌మిష‌న‌ర్ల‌కు ఆదేశాలు జారీ చేశారు.

కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న లేదా బ‌ల‌హీనంగా ఉన్న భ‌వ‌నాల‌ను గుర్తించాల‌ని సూచించారు. ఇప్ప‌టికే గుర్తించిన భ‌వ‌నాల‌ను వేగంగా కూల్చాలి అని చెప్పారు. హైద‌రాబాద్ ప‌రిధిలో 170 వ‌ర్షాకాల అత్య‌వ‌స‌ర బృందాలు ప‌ని చేస్తున్నాయ‌ని తెలిపారు. మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు త‌వ్విన గుంత‌ల‌కు కంచె ఏర్పాటు చేయాల‌ని సూచించారు. ఇప్ప‌టికే గుర్తించిన నీటి నిల్వ ప్ర‌దేశాల్లో ప్ర‌త్యేక బృందాల‌తో చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని కేటీఆర్ ఆదేశించారు.

ఈ స‌మావేశానికి పుర‌పాల‌క‌, జీహెచ్ఎంసీ, జ‌ల‌మండ‌లి అధికారులు హాజ‌ర‌య్యారు.

5 COMMENTS

  1. Have you ever heard of second life (sl for short). It is essentially a online game where you can do anything you want. SL is literally my second life (pun intended lol). If you would like to see more you can see these sl articles and blogs

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here