క్రిమినల్ కేసుల్లో 2,556 మంది ఎమ్మెల్యేలు,ఎంపీలు…

81
491

త మంగళవారం సుప్రీంకోర్టుకు ఓ అరుదైన సమాచారం అందింది. అది మన ప్రజా ప్రతినిధుల ప్రమేయం కలిగిన క్రిమినల్ కేసులకు సంబంధించిన జాబితా. ప్రస్తుతం వారిపై ఏ రాష్ట్రంలో ఎన్నికేసులు పెండింగ్ లో ఉన్నాయో మొత్తం సమా చారాన్ని కోర్టుకు సమర్పిం చారు.

దాని ప్రకారం 22 రాష్ట్రాల నుండి 2,556 మంది ఎమ్మెల్యేలు,ఎంపిలు క్రిమినల్ కేసుల లో నిందితులుగా ఉన్నారు. ఇక ఈ రాష్ట్రాలకు చెందిన మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేల ను కూడా చేర్చితే ఈ సంఖ్య 4,442 కు చేరుతుంది. పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల ఎన్నికైన ప్రతినిధులపై క్రిమినల్ కేసులను త్వరగా పరిష్కరించాలని కోరుతూ అశ్వని కుమార్ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిల్ లో అమికస్ క్యూరీ (విచారణ సందర్భంగా న్యాయస్థానానికి సహాయపడుటకు నియమించబడిన నిష్పక్షపాత సలహాదారు) సీనియర్ న్యాయవాది విజయ్ హన్సరియా ఈ సమాచారాన్ని నివేదించారు.

ఇటీవలి సంవత్సరాలలో, క్రిమినల్ కేసులను ఎదుర్కొనే అభ్యర్థులు, ఎన్నికైన ప్రతి నిధుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దాంతో రాజకీయాలు నేరపూరితం కావటం పట్ల రోజు రోజుకు ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోంది. సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన 174 కేసుల్లో వారు జీవిత ఖైదు శిక్షకు అర్హులు. లైవ్ లా ప్రకారం, ఎన్ని కైన ప్రజా ప్రతినిధులకు వ్యతిరేకంగా అవినీతి నిరోధక చట్టం 1988, మనీలాండరింగ్ నిరోధక చట్టం 2002, ఆయుధాల చట్టం 1959, ప్రజా ఆస్తికి నష్టం నివారణ చట్టం, 1984, భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 500 కింద పరువు నష్టం ( ఐపిసి), ఐపిసి సెక్షన్ 420 కింద మోసం కేసులు నమోదై ఉన్నాయి. ప్రజా ప్రతినిధులపై నమోదైన క్రిమినల్ కేసుల్లో చాలా వరకు ఐపిసి సెక్షన్ 188 ను ఉల్లంఘించినవే. అంటే వారు ప్రభుత్వ చట్టాలకు విధేయత చూపక పోవటం, ప్రభుత్వ ఉద్యోగుల విధులకు అడ్డుతగటం వంటివి.

క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న శాసనసభ్యులు యుపిలో నే అధికం. ఆ రాష్ట్రం నుంచి 1,217 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో 446 కేసుల్లో సిట్టింగ్ ఎమ్మె ల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు నిందితులు. వారిలో 35 మంది సిట్టింగ్, 81 మంది మాజీ శాసనసభ్యులు జీవితకాల శిక్షార్హమైన ఘోర నేరాలకు పాల్పడ్డారు. యుపి తరువా త, అత్యధిక సంఖ్యలో క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్న రాష్ట్రం బీహార్, ఇక్కడ 531 మంది సిట్టింగ్ మరియు మాజీ ఎమ్మెల్యేలు, ఎంపిలు నిందితులు. వీటిలో 73 కేసులు జీవిత ఖైదుతో శిక్షార్హమైన నేరాలకు సంబంధించినవి (సిట్టింగ్ శాసన సభ్యు లపై 30 కేసులు, మాజీ శాసనసభ్యులపై 43 కేసులు). కేరళ (333 కేసులు), ఒడిశా (331), మహారాష్ట్ర (330), తమిళనాడు (324) సిట్టింగ్, మాజీ శాసనసభ్యులు క్రిమి నల్ కేసులను ఎదుర్కొంటున్న మొదటి ఐదు రాష్ట్రాలు.కొన్ని రాష్ట్రాల్లో ఈ తరహా కేసులు తక్కువగా ఉన్నందున కోర్టుకు సమర్నించిన సమాచారంలో ఆ రాష్ట్రాల వివరాలు ఇవ్వలేదని, వాటిని ప్రత్యేకంగా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకు రావాల్సిన అవసరం లేదని బావించినట్టు అమికస్ తెలిపింది. అంతేగాక న్యాయస్థానికి కొన్ని సూచనలు కూడా చేశారు.

ప్రజా ప్రతినిధులు నిందితులుగా ఉన్న కేసేులు త్వరగా తేలట్లేదు. ఏళ్లకు ఏళ్లు కొనసాగుతున్నాయి. దీంతో పెద్ద సంఖ్యలో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కోర్టులు జారీ చేసిన నాన్-బెయిలబుల్ వారెంట్లు (ఎన్‌బిడబ్ల్యు) కూడా అమలుకు నోచుకోవ ట్లేదు. వేగవంతమైన విచారణకు సూచనలు. ఈ కేసుల విచారణ కోసం ప్రతి జిల్లా లోని ప్ర త్యేక న్యాయస్థానాల ఏర్పాటు చేయాలి. వీటిలో ఎంపీలు,ఎమ్మెల్యేలు నింది తులుగా ఉన్న కేసులపై త్వరితగతిన విచారణకు ప్రాధాన్యత ఉండాలి. అలాగే ఈ ప్రత్యేక న్యాయస్థానాలు మరణ / జీవిత ఖైదుతో శిక్షార్హమైన నేరాలకు సంబంధించి న కేసులకు ప్రాధాన్యత ఇవ్వాలి. తరువాత 7 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్షతో కూడిన నేరాలు ఈ క్రమంలో ఉండాలని అమికస్ సూచించారు.

సిట్టింగ్ శాసనసభ్యుల ప్రమేయం ఉన్న కేసులకు మాజీ శాసనసభ్యులు నిందితు లుగా ఉన్న కేసుల కంటే ప్రాధాన్యత ఇవ్వాలి. అరుదైన,అసాధారణమైన పరిస్థి తులలో సహేతుక కారణాలు చూపిస్తే తప్ప ఈ కేసుల వాయిదాకు ఎటువంటి మినహాయింపు ఉండరాదు. నిర్ణీత తేదీలలో నిందితులను కోర్టుకు ముందు ప్రవేశపెట్టే బాధ్యత జిల్లా పోలీసు సూపరింటెండెంట్లది. అలాగే కోర్టులు జారీ చేసిన నాన్-బెయిలబుల్ వారెం ట్లను అమలు చేయాల్సిన బాధ్యత కూడా వారిదేనని సూచించారు.

సిట్టింగ్ , మాజీ శాసనసభ్యుల ప్రమేయం ఉన్న కేసులలో సాక్షులకు రక్షణ కల్పించటం ప్రభుత్వ బాధ్యత. ఇటువంటి సందర్భాల్లో, నేర విచారణలను ఎదుర్కొంటున్న శాసనసభ్యుల ప్రభావం వల్ల సాక్షులకు హాని జరిగే అవకాశాలు ఎక్కువని అమికస్ గుర్తించారు. ఈ విషయంలో, పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు తగిన చట్టాన్ని అమలు చేసే వరకు “సాక్షి రక్షణ పథకం, 2018” ను అన్ని రాష్ట్రాలకు వర్తించేలా చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించేలా చూడడానికి సంబంధిత హైకోర్టులు “In Re: Special Courts for MPs/MLAs” అనే శీర్షికతో సుమో మోటు కేసును నమోదు చేయడం ద్వారా ఈ కేసులలో సాధించిన పురోగతిని పర్యవేక్షించాలి.

2018 సెప్టెంబరులో, అప్పటి ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా పదవీకాలం చివరి రోజులలో..క్రిమినల్ కేసుల్లో ఉన్న రాజకీయ నాయకులను ఎన్నికలలో పోటీచేయకుండా నిషేధించడానికి సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. అలాంటి ఏవైనా చేయాలంటే పార్లమెంట్ ద్వారా మాత్రమే చేయాల్పివుంటుందని స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని సర్వోన్నత న్యాయస్తానం పార్లమెంటు కు సూచించింది. ఆ నిర్ణయం కోసం యావత్ దేశం ఆత్రంగా ఎదురుచూస్తోందని పేర్కొంది.

81 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here