మెట్రో ట్రెయిన్స్ ఓకే…మరి సిటీ బస్సులు ఎప్పుడు?

0
124

సిటీ బస్సులు ఎప్పటి నుంచి తిరుగుతాయి?
కరోనా నిబంధనల ప్రకారమే సేవల పునరుద్ధరణ
ఈ నెల 7 నుంచి మెట్రో ట్రెయిన్ సేవలు
నగదు రహిత టిక్కెట్ విక్రయాలు
నిబంధనలు అతిక్రమిస్తే భారీ ఫైన్లు


గర వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెట్రో రైల్ సేవలు మరో రెండు రోజుల్లో ప్రారంభమవుతున్నాయి. అన్ లాక్ 4.0లో భాగంగా కేంద్రం మెట్రో సేవలకు అనుమతించింది. దీంతో హైదరాబాద్ లో సెప్టెంబర్ 7నుంచి నగరంలో మెట్రో పరుగులు తీయనుంది. అయితే కేంద్రం ప్రకటించిన నిబంధనల ప్రకారమే మెట్రో తన సేవలు కొనసాగించాల్సి వుంటుంది. అయితే అన్ని ప్రాంతాలలో మెట్రో సేవలు ఒకేసారి పునరుద్ధరించబడవు. ఆ ప్రక్రియ దశల వారిగా జరగనుంది.

కంటెయిన్మెంట్ జోన్లు అయిన గాంధీ ఆసుపత్రి, భరత్ నగర్, మూసాపేట, ముషీరాబాద్, యూసఫ్ గూడ స్టేషన్లలో మెట్రో రైళ్లు ఆగవు. గతంలో ప్రతి ఐదు నిమిషాలకో ట్రెయిన్ అందుబాటులో ఉండేది. అయితే ఇప్పుడు ఎలా నడుపుతారో ఇంకా తెలియదు. ఇక ప్రయాణీకులకు ఫేస్ మాస్క్ తప్పనిసరి. సోషల్ డిస్టెన్స్ పాటించాల్సిందే. ఏ మాత్రం కరోనా లక్షణాలున్నా అనుమతి లేదు. లక్షణాలు లేని వారిని మాత్రమే రైళ్లలోకి అనుమతిస్తారు. ఇక టిక్కెట్ కౌంటర్లు ఇప్పుడే లేవు. స్మార్ట్ కార్డు, ఆన్ లైన్లో టికెట్లు కోనుగోలు చేయాల్సి ఉంటుంది.

తొలివిడతలో సెప్టెంబర్ 7న కారిడార్‌-1 (మియాపూర్‌ – ఎల్‌బీ నగర్‌) పరిధిలో మెట్రో రైళ్లు నడవనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు.. మళ్లీ సాయంత్రం 4 గంటల నుంచి 9 గంటల వరకు రైళ్లు అందుబాటులో ఉంటాయి.
రెండో విడతలో 8న కారిడార్‌-3 (నాగోల్‌- రాయ్‌దుర్గ్‌)లో మెట్రో సేవలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 7 గంటల నంచి 12 గంటల వరకు.. సాయంత్రం 4 నుంచి 9 వరకు రైళ్లు నడుపుతారు.
మూడో విడతలో ఈ నెల 9 నుంచి అన్ని కారిడార్లలో రైళ్లు అందుబాటులోకి వస్తాయి. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే మెట్రో సేవలు ఉండనున్నాయి.

ఇక ప్రయాణికులు మాస్కులు ధరించనిపక్షంలో జరిమానాలను తప్పవు. మెట్రో సిబ్బందికి పీపీఈ కిట్లను అందిస్తారు. టిక్కెట్లను నగదు రూపంలో కొనుగోలు చేసేందుకు తాత్కాలికంగా అనుమతి లేదు. స్మార్ట్ కార్డు, క్యాష్‌లెస్ విధానాల్లోనే ప్రస్తుతానికి విక్రయిస్తారు. ఇక కంటైన్మెంట్‌ జోన్లలోని స్టేషన్‌లను ఇప్పట్లో తెరిచే అవకాశం లేదు. గాంధీ హాస్పిటల్, భరత్ నగర్, మూసాపేట, ముషీరాబాద్, యూసఫ్‌గూడ స్టేషన్లు మూసివేత మరికొంత కాలం కొనసాగనుంది. ఇక ప్రయాణికుల సంఖ్యను బట్టి రైలు ఫ్రీక్వెన్సీపై నిర్ణయం తీసుకోనున్నారు. మెట్రో స్టేషన్లతో పాటు రైళ్లలో కూడా భౌతిక దూరం పాటించాలి. సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షించనున్నారని మెట్రో ఉన్నతాధికారులు అంటున్నారు.

ఏదేమైనా గత కొన్ని నెలలుగా నగరంలో ప్రజా రవాణా వ్యవస్థ నిలిచిపోవటంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజా అన్ లాక్ లో మెుట్రోకు అనుమతించటం ఉద్యోగులకు కొంత ఊరట. మెట్రో సేవలు ప్రారంభం కాగానే సిటీ బస్సులు కూడా నడుస్తాయని నగర వాసులు బావిస్తున్నారు. బస్సులు ఆగిపోవటం తో ఆటోలు..క్యాబ్ లకు డిమాండ్ ఏర్పడింది. దీంతో వారు అదే అదనుగా తమ ఇష్టం వచ్చినంత వసూలు చేస్తున్నారు. షేరింగ్ ఆటోల్లో మినిమం 20 రూపాయలు వసూలు చేస్తున్నారు. సిటీ బస్ సర్వీసులు ప్రారంభమైతేనే సామాన్యుడికి ఊరట!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here