బొమ్మతుపాకి కాదు నిజం తుపాకే…

1
195

తెలియక కాల్చుకుని ప్రాణాలు కోల్పోయిన యువకుడు 

ఈ తుపాకీనీ చూస్తుంటే అచ్చు బొమ్మ తుపాకీలాగే ఉంది. పాపం అతడు కూడా అదే అనుకున్నాడు. కాల్చుకుని ప్రాణాలు కోల్పోయాడు.. బొమ్మ తుపాకి అని భ్రమపడి తనను తాను కాల్చుకుని ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన మహారాష్ట్ర థానే జిల్లాలోని షాహాపూర్‌లో జరిగింది. అటగావ్‌లోని రెసిడెన్షియల్‌ కాలనీలో ఒక వ్యక్తి పుట్టినరోజు వేడుకలు జరిగాయి. పక్క ఫ్లాట్‌లో ఉంటున్న సిద్ధేశ్‌ జనగం (28) ఈ వేడుకలకు హాజరయ్యాడు. అదే సమయంలో పుట్టినరోజు జరుపుకుంటున్న వ్యక్తి నివాసంలో తుపాకి కనిపించడంతో.. బొమ్మ తుపాకి అని భావించి కాల్చుకున్నాడు. తుపాకి నుండి బుల్లెట్‌ సిద్ధేశ్‌ శరీరంలోకి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తుపాకి పేలిన శబ్దానికి అందరూ అక్కడికి చేరుకునే సమయానికి సిద్ధేశ్‌ ప్రాణాలు కోల్పోయాడు. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

1 COMMENT

  1. I really like your writing style, good information, thanks for posting :D. “Freedom is the emancipation from the arbitrary rule of other men.” by Mortimer Adler.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here