కంగనకు ప్రాణ హాని …?

71
487

వతలివారు ఎవరని చూడకుండా కుండ బద్దలు కొట్టటం బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌ అలవాటు. బాలీవుడ్‌ స్టార్స్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇండిస్టీలో 99 శాతం మంది డ్రగ్స్‌ను ఉపయోగిస్తున్నారని బాంబు పేల్చింది. డ్రగ్స్‌ను సప్లై చేసేవారిని విచారిస్తే చాలా మంది స్టార్స్‌ జైల్లోనే ఉండాల్సి వస్తుందని పేర్కొన్నారు.
అంతే కాకుండా ఓ స్టార్‌ హీరో డ్రగ్స్‌ను ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల ఓసారి అతను ఆస్పత్రి పాలయ్యాడని, అందుచేతనే అతని భార్య అతనికి విడాకులిచ్చిందని చెప్పింది. ఆ సమయంలో తను అతనితో డేటింగ్‌లో ఉన్నానని కూడా చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఇండిస్టీలో తనకు గురువు అని చెప్పుకునే వ్యక్తే తనకు డ్రగ్స్‌ రుచి చూపించారని పేర్కొంది. బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ మృతి కేసును సిబిఐ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.. సుశాంత్‌ ప్రియురాలు రియా చక్రవర్తిని సిబిఐ ఇప్పటికే పలుసార్లు విచారించింది.
అయితే రియా డ్రగ్స్‌ సప్లయర్స్‌తో జరిపిన చాటింగ్‌ను సుశాంత్‌ సోదరి బయటపెట్టడంతో రియాకు డ్రగ్స్‌ సప్లయర్స్‌తో సంబంధాలున్నట్లు సిబిఐ అధికారులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలోనూ విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇండిస్టీ పెద్దలపై కంగనా చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌లో ప్రకంపనలు రేపుతున్నాయి.
ఇదిలావుంటే, బాలివుడ్ డ్రగ్ మాఫియా సంబంధాలపై సంచలన ట్వీట్లు చేసిన కంగనకు రక్షణ కల్పించకపోవటంపై భారతీయ జనతా పార్టీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరేను ప్రశ్నించింది. హిందీ చిత్ర పరిశ్రమతో డ్రగ్ మాఫియా సంబంధాలను కూకటి వేళ్లతో పీకిపారేయటం ముఖ్యమని బీజేపీ తెలిపింది.

బీజేపీ ఇంతగా హెచ్చరిస్తున్నదంటే కంగనకు డ్రగ్ మాఫియా నుంచి ప్రాణ హాని ఉందన్న అనుమానం కలుగుతోంది.

71 COMMENTS

  1. Este site é realmente incrível. Sempre que consigo acessar eu encontro coisas boas Você também pode acessar o nosso site e descobrir mais detalhes! conteúdo único. Venha descobrir mais agora! 🙂

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here