కరణ్ పై కంగన ఫైర్…

4
250

సుశాంత్‌రాజ్‌పుత్‌ ఆత్మహత్యపై బాలీవుడ్ లో విమర్శలు ప్రతి విమర్శలకు ఇంకా తెరపడలేదు. నిర్మాత కరణ్‌జోహర్‌పై విమర్శల పర్వాన్ని కొనసాగిస్తోంది నటి కంగనారనౌత్‌. సుశాంత్‌రాజ్‌పుత్‌కు అవకాశాలు లేకుండా చేసి అతడి ఆత్మహత్యకు కరణ్‌జోహార్‌ కారణమయ్యాడంటూ గత కొంతకాలంగా కంగనా రనౌత్‌ ఆరోపణలు చేస్తోన్న విషయం తెలిసింది. తాజాగా మరోమారు అతడిపై మరోసారి మండిపడింది. కరణ్‌జోహార్‌కు ఇచ్చిన పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి తీసుకోవాలంటూ ప్రభుత్వాన్ని కోరింది కంగనా రనౌత్‌.

‘చిత్ర పరిశ్రమను వదిలిపెట్టి వెళ్లమంటూ ఓ అంతర్జాతీయ వేదిక ద్వారా కరణ్‌జోహర్‌ నన్ను బెదిరించాడు. సుశాంత్‌ కెరీర్‌ను నాశనం చేసేందుకు కుట్రలు పన్నాడు. యురి యుద్ధ సమయంలో పాకిస్థాన్‌కు అనుకూలంగా కరణ్‌జోహర్‌ వ్యవహరించారు. భద్రతా దళాలకు వ్యతిరేకంగా జాతి వ్యతిరేక చిత్రాన్ని రూపొందించారు. అతడికి ప్రదానం చేసిన పద్మశ్రీ అవార్డును వెనక్కి తీసుకోవాలని భారత ప్రభుత్వాన్నికోరుతున్నా’ అంటూ కంగనా రనౌత్‌ ట్వీట్‌ చేసింది. కరణ్‌జోహర్‌ను ఉద్దేశిస్తూ కంగనా రనౌత్‌ పెట్టిన ఈ ట్వీట్‌ బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

సుశాంత్‌ అభిమానులు కంగనా అభిప్రాయాన్ని సమర్థిస్తుండగా కొందరు బాలీవుడ్‌ ప్రముఖులు మాత్రం ఆమె వ్యాఖ్యలు అర్థరహితమని విమర్శిస్తున్నారు. తాజాగా సుశాంత్ కేసును సుప్రీం కోర్టు సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here