అదిగో క్వీన్ ..ముంబై వచ్చేసింది..!

1
158

చెప్పినట్టుగానే బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ముంబైలో అడుగుపెట్టింది. బుధవా రం మధ్యాహ్నం భారీ భద్రత మధ్య ముంబై ఛత్రపతి శివాజీ మహరాజ్‌ ఇంటర్న షన ల్‌ ఎయిర్‌పోర్ట్‌లో దిగారు. ఆమె రాక గురించి అప్పటికే తెలియటంతో ఎయిర్‌పోర్ట్‌ బయట శివసేన కార్యకర్తలు పెద్దసంఖ్యలో గుమికూడి ఆమెను అడ్డుకోవాలనుకు న్నారు. అయితే అదే సమయంలో కర్ణిసేన, ఆర్‌పీఐ కార్యకర్తలు క్వీన్‌కు మద్దతుగా భారీగా తరలివచ్చారు. ఇరు వర్గాలు ఎయిర్‌పోర్ట్‌ వద్ద నినాదాలతో హోరెత్తించడంతో ఉద్రిక్తత నెలకొంది.


దీంతో ఆమెను విమానాశ్రయం ప్రత్యేక గేట్‌ నుంచి బయటకు వెళ్లారు. మరోవైపు, కంగనా కార్యాలయం కూల్చివేతపై బాంబే హైకోర్టు స్టే ఇచ్చింది. తన ఇంటిలో ఎలాంటి అక్రమ నిర్మాణం చేపట్టలేదని, కోవిడ్‌ కారణంగా సెప్టెంబర్‌ 30 వరకూ కూల్చివేతలను ప్రభుత్వం నిషేధించిందని కంగనా ట్వీట్‌ చేశారు. ఫాసిజం ఎలా ఉంటుందో బాలీవుడ్‌ ఇప్పుడు చూస్తోందని బీఎంసీ చర్యపై కంగనా ఫైర్ అయ్యారు.

కాగా, బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ కేసు విచారణకు సంబంధించి ముంబై పోలీసులపై తనకు నమ్మకం లేదని కంగన చేసిన వ్యాఖ్యలతో వివాదం రాజుకుంది. దీంతో శివసేన ఆమెపై మాటల దాడికి దిగింది. ముంబై పోలీసులపై నమ్మకం లేకుంటే నగరంలో ఉండరాదని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ముంబై ఎవడబ్బ సొత్తు కాదని ఈనెల 9న ముంబై వస్తున్నానని దమ్ముంటే అడ్డుకోవాలని కంగనా సవాల్ చేసి మరీ ముంబైలో కాలు పెట్టారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here