ఛీ..ఛీ..ఇదేం సోషల్ మీడియా..! పాపం పవన్!

74
542

సోషల్ మీడియాలో వికృత చేష్టలకు వేదికగా మారుతోంది. నిజాలకు బదులు అసత్యాలకే ప్రచారానికే ఇది వేదికవుతోంది. తమకు ఇష్టం లేని వారిపై ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేయటం..బూతులు తిట్టటం కామన్ అయింది. నాగరికులకు ఇది పెద్ద చికాకుగా మారింది. సోషల్ మీడియాను ఫాలో వుతున్నారం టే అంతో ఇంతో చదువుకున్నవారే కదా. చదువు సంధ్యలు లేని వారు తెలియక ఏదో తెలియక తప్పుగా మాట్లాడితే క్షమించ వచ్చు, కానీ చదువు సంద్యలు ఉండి కూడా ఆలోచనా రహితంగా సెలబ్రిటీలను టా ర్గెట్ చేస్తూ పిచ్చిరాతలు ..పిచ్చి కూతలు కూయటం ..పిచ్చి చేష్టలు చేయటం ఏం జ్ఞానం అనిపించు కుంటుది? వ్యక్తి గత ధూషణలకు దిగటం ఏ విధమైన సంస్కారం?

వారన్నారని వీరు ..వీరన్నారని వారు ఒకరినొకరు తిట్లపురణంతో రెచ్చిపోయే సోషల్ మీడియాను రొచ్చు రొచ్చు చేస్తున్నారు. ఈ రకమైన ట్రెండ్ రోజు రోజుకు మరింత పెచ్చుమీరుతోంది. ఎవరైనా వ్యక్తి వారు ఏ పార్టీకి చెందిన వారైనా..ఏ రంగానికి చెందిన సెలబ్రిటీ అయినా తమకు ఇష్టం లేకపోతే ఊరకే ఉండాలి. విమర్శించినా సహేతుకంగా ఉండాలి. లేదా అందరికి నచ్చేలా ఓ ఫన్నీ కామెంట్ విసరొచ్చు.. కానీ..ఇదేం పోకడ. అందుకే కావచ్చు చాలా మంది నాగరికులు ఇప్పుడు సోషల్ మీడియా అంటే వెగటు ఫీలవుతున్నారు.. క్రమంగా సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లను వీడుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే చివరకు అందులో మిగిలేది రొచ్చు బ్యాచే.

తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోటోలు మార్ఫింగ్ చేశారని సైబర్‌ క్రైంకు ఫిర్యాదు అందటం ఈ ట్రెండ్ కి ఓ తాజా ఉదాహరణ. పవన్ కళ్యాణ్ చిత్రాలను మార్ఫ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జనసేన పార్టీ కార్యకర్తలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమ నాయకుడి ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఆయన ఫొటోలను మార్ఫింగ్ చేసి ప్రచారం చేస్తున్నారు వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు అందింది ..ప్రస్తుతం వారు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రథం దగ్ధం అయిన నేపథ్యంలో ఈ ఘటనపై ధర్మ పోరాట దీక్ష చేపట్టారు పవన్ కళ్యాణ్. ఆ ఫోటోలు మార్ఫింగ్ చేసిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని పిర్యాదు చేసారు. ఆలయాలపై దాడులకు నిరసనగా పవన్ దీపాల ప్రజ్వలనకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన కూడా తన ఫామ్ హౌస్ లో దీపం వెలిగించి ధ్యానం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను జనసేన పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

74 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here