భారత్ లో కరోనా తగ్గుముఖం పట్టిందా..

36
531

మనదేశంలో కరో మహమ్మారి ప్రభావం తారా స్థాయి నుంచి కిందకు దిగుతోందా? గణాంకాలు చూస్తే ఇదే అనిపిస్తుంది. దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తోంది. అలాగే మరణాల రేటు కూడా గణనీయంగా తగ్గుతోంది.

మంగళవారం 75 వేల తాజా కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు కొన్ని రోజులుగా నిత్యం 90 వేలకు పైగా నమోదయ్యాయి. అలాగే ఇప్పుడు రికరవరీ రేటు కూడా గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 55 లక్షల పాజిటివ్ కేసులు నమొదైతే ..యాక్టివ్ కేసులు పది లక్షల దిగువకు పడిపోవ టం తీవ్రత తగ్గుతుందనటానికి ఓ నిదర్శనం.

దేశ వ్యాప్తంగా ఇప్పుడు కోవిడ్ పరీక్షలు సులభతరం అయ్యాయి. దీంతో పరీక్షల సంఖ్య కూడా పెరిగిం ది. మొత్తం మీద జనంలో ఇప్పుడు కోవిడ్ 19 పట్ల మునుపు ఉన్నంత భయం మాత్రం లేదు. బయట పరిస్థితిని ప్రత్యక్షంగా చూసినవారికి ఈ విషయం అర్థమవుతుంది.

మనదేశంలో కరోనా మరణాలు మూడు శాతం లోపే ఉన్నాయి. సెప్టెంబర్‌ 10వ తేదీ నాటికకి అది 1.7 శాతానికి పడిపోయింది. తరువాత సెప్టెంబర్‌ 20వ తేదీ నాటికి 2.65కు చేరుకుంది. అయినా, ఇది అభి వృద్ధి చెందిన దేశాలకన్నా తక్కువే. భారత్‌కన్నా అన్ని రకాలుగా ఎంతో ముందున్న అమెరికా, బ్రిటన్ వంటి దేశాలలో ఎక్కువ ప్రాణ నష్టం సంభవించింది. ఈ విషయంలో భారత్ చాలా సేఫ్ అని చెప్పాలి.

సకాలంలో లాక్‌డౌన్‌ను విధించి కచ్చితంగా అమలు చేయడం. కేంద్రమే కాకుండా కొన్ని రాష్ట్ర ప్రభుత్వా లు కూడా అప్రమత్తంగా వ్యవహరించటం. భారత్‌లో యువత ఎక్కువగా ఉండడం వల్ల వారికి కరోనాను తట్టుకునే ఇమ్యూటీ ఉండటం భారత్ లో మరణాల రేటు తక్కువగా ఉందన్న వాదనలు ఉన్నాయి.

మరోపక్క భారత్‌లో కరోనా బారిన పడి మరణిస్తోన్న వృద్ధతరంలో ఎక్కువ మంది చావులు లెక్కలోకి రాకుండా పోతున్నాయని పలు జాతీయ, అంతర్జాతీయ నివేదికలు తెలియజేస్తున్నాయి. అమెరికా, బ్రిటన్‌ లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతి మరణంతోపాటు ఆ మరణానికి కారణం ఏమిటో అధికారికంగా నమోదవుతుంది. ఓ వ్యక్తి ఏ కారణంతో చనిపోయారో తెలియకపోతే ఆ దేశాల్లో మృత దేహాలకు అటాప్సీ చేసి మరీ మరణ కారణాన్ని నమోదు చేస్తారు.

సాధారణ పరిస్థితుల్లోనే భారత్‌లో 70 శాతం మరణాలు ప్రభుత్వ లెక్కల్లోకిగానీ, దృష్టికిగానీ రావు. దేశంలో కరోనా కల్లోలం నేపథ్యంలో ప్రతి చావుకు కారణం నమోదు చేయమని, అందుకు ప్రతి అను మానిత మృత దేహానికి కరోనా పరీక్షలు జరిపించాలంటూ పలు హైకోర్టులు ఇచ్చిన పిలుపులను అమ లు చేయడం తమ వల్ల కాదంటూ పలు రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేశాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా అలాగే చేసింది. భారత్‌లో కరోనా బారిన పడిన యువత కోలుకుంటుండడం, కరోనాతో మరణించిన వృద్ధుల లెక్కలు కరోనా లెక్కల్లోకి రాకపోవడం వల్లనే భారత్‌లో కరోనా మృతుల సంఖ్య తక్కువగా ఉందని పలు నివేదికలు అంటున్నాయి.

ఏదేమైనా, ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుతుండటం శుభసూచకం. త్వరలోనే కరోనా కష్టాలు తొలగిపో తాయన్న ఆశా కనిపిస్తోంది. అలాగే త్వరలోనే ప్రభుత్వ పెద్దాసుపత్రుల్లో సాధారణ వైద్య సేవలు పునరు ద్ధించే అవకాశం ఉంది. అయినా కరోనా వ్యాక్సన్ అందుబాటులోకి వచ్చేవరకు పరిస్థితిని అంచనా వేయ లేం. ఏమరపాటుగా ఉంటే ప్రమాదం ముంచుకొస్తుంది. మన జాగ్నత్తల్లో మనం ఉండటం ఉత్తమం!

36 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here