కేసులు 53 లక్షలు, మరణాలు 85 వేలు.. కొనసాగుతున్న కరోనా ఉధృతి..

0
113

నాన్ని గడగడలాడిస్తున్న కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 1,247 మరణాలు సంభవించాయి. దాంతో మరణాల సంఖ్య 85 వేలు దాటిపోయింది. శుక్రవారం కొత్త పాజిటివ్ కేసులు కాస్త తగ్గాయి. అయినా 90 వేలకు పైగానే నమోదయ్యాయి.దేశంలో గడచిన 24 గంటల్లో కొత్తగా 92 వేల 969 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఇదేసమయంలో 95 వేల 512 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. ఈ మహమ్మారి దేశంలోకి ప్రవేశించి 232 రోజులు పూర్తయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఒక్కరోజులో ఎన్నికేసులు నమోదయ్యాయో, అంతమంది డిశ్చార్జ్ కావడం ఇది ఆరవసారి.

ఇప్పుడు దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 53,08,015 గా ఉంది, వీటిలో 10,13,964 యాక్టివ్ కేసులు, 42,08,432 మందికి కోవిడ్ నుంచి బయటపడ్డారు. అలాగే, మొత్తం మరణాల సంఖ్య 85,619గా ఉందని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

మధ్యప్రదేశ్‌లో కొత్తగా 2,552 కరోనా కేసులు నమోదు కాగా, రాజస్థాన్‌లో 1,817, బీహార్ లో 1,147, మహారాష్ట్రలో 21,656, ఉత్తరప్రదేశ్‌లో 6,494 కేసులు నమోదయ్యాయి.

మరోవైపు, కోవిడ్ -19 రికవరీ విషయంలో భారత్..అమెరికాను అధిగమించింది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here