భయపడ్డంతా అయింది..సుమేధ ఇక లేదు..

0
144

యపడ్డంతా అయింది..నెరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దీనదయాళ్ నగర్‌లో నిన్న సాయంత్రం అదృశ్యమైన మైనర్ బాలిక విగత జీవిగా కనిపించింది. బాలిక మృతదేహాన్ని స్థానిక బండ చెరువులో పోలీసులు గుర్తించారు.

నెరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దీనదయాళ్ నగర్‌లో నిన్న సాయంత్రం అదృశ్యమైన 12 ఏళ్ల సుమేధా కపారియా మిస్టరీ విషాదంగా ముగిసింది.. బాలిక తల్లి సుకన్య కపాడియా ఫిర్యాదు మేరకు గత రాత్రి నుంచి రంగంలోకి దిగిన పోలీసులు శుక్రవారం ఉదయం అత్యవసర బృందాలతో కలిసి జరిపిన గాలింపులో బాలిక మృతదేహాన్ని సమీపంలోని బండ చెరువులో గుర్తించారు.

నిన్న సాయంత్రం సైకిల్ తొక్కుకుంటూ వెళ్లిన బాలిక భారీగా కురిసిన వర్షంతో నాలాలో కొట్టుకు పోయింది.. నాలా వద్ద సైకిల్ లభ్యమైంది. కళ్ళ ముందే హుషారుగా సైకిల్ తొక్కుతూ కనబడిన సుమేధా మృతి.. ఇటు కన్నవారిని, అటు స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.

సుమేధ నాలాలో పడిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానమే నిజం కావటంతో స్థానికులు కంటతడి పెడుతున్నారు. ఖైరాలీ పబ్లిక్‌ స్కూల్‌లో సుమేధ 5 వ తరగతి చదువుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here