టాలీవుడ్ లో ధైర్యం నింపుతున్న అక్కినేని సోగ్గాళ్లు…

0
127

షూటింగ్‌లు తిరిగి మొదలుపెట్టుకోవడానికి ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చినా స్టార్ హీరోలు మాత్రం భయపడుతున్నారు. ఏ స్టార్ హీరో షూటింగ్ మొదలుపెట్టలేదు. కానీ, అక్కినేని నాగార్జున ఆ పని చేశారు. బిగ్ బాస్ సీజన్ 4 ని పట్టాలెక్కించారు. నాగార్జున ఇద్దరు కొడుకులు కూడా తండ్రి బాటలో నడుస్తూ మిగతా హీరోలలో ధైర్యం నింపుతున్నారు. ఇప్పుడు ఆ ఫ్యామిలీలో ని ముగ్గురు హీరోలు ఫూటింగ్ లతో బీజీబిజీగా ఉన్నారు.

మొదట కింగ్ నాగార్జున గురించి చెప్పాలి.. ..కేవలం ఆయన వల్లే బిగ్ బాస్ 4 ఇప్పుడు ఇలా వుంది. అందుబాటులో ఉన్న వారినే కంటెస్టెంట్లుగా పెట్టి బండి నడిపిస్తున్నారు. అంతేకాదు షోని సూపర్ హిట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు కింగ్ .

నాగార్జున పెద్ద కుమారుడు చైతన్య ల‌వ్ స్టోరీ షూటింగ్ లో బిజీ అయ్యారు. శేఖ‌ర్ క‌మ్ముల దీనికి దర్శకుడు. కరోనా అడ్డుపడకపోతే ఈ పాటికి విడుద‌లయ్యేదే. ఇప్పుడు ల‌వ్ స్టోరీ షూటింగ్ మ‌ళ్లీ మొద‌లైంది.తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ పార్ట్ పూర్తయినట్టు తెలుస్తోంది.

అతి తక్కువ మంది సిబ్బంది , నటీనటులతో లవ్ స్టోరీ షూటింగ్ పార్ట్ పూర్తి చేశారట. షూటింగ్ పూర్తయ్యే వరకు యూనిట్ లో ఎవరూ తమ ఇళ్లకు వెళ్లలేదు. అలా అని ముందే అంతా అనుకున్నారు. ఇప్పుడు షూ టింగ్ అయిపోవటంతో ఎవరిళ్లకు వారు వెళ్లారని సమాచారం. ఇక మిగతి కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను విడుదలకు రెడీగా ఉంచుతారు. థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అయితే అప్పడు దీనిని వెండితెర మీద చూడొచ్చు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని శేఖ‌ర్ క‌మ్ముల బావిస్తున్నట్టు తెలిసింది.

ఇక అక్కినేని నాగార్జున రెండో కుమారుడు అఖిల్ అక్కినేని బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ చేస్తున్నాడు. కరోనా రిస్క్ ని లెక్క చేయకుండా అఖిల్ఈ సినిమాను ఛాలెంజింగ్ తీసు కుని నటిస్తున్నాడు. అఖిల్ కెరీర్లో ఇప్పటి వరకు పెద్ద హిట్ లేదు. ఈ నేపథ్యంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ సూపర్ డూపర్ హిట్టయ్యేలా దర్శక నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చేస్తున్నారు. కరోనా ఆంక్షలు పూర్తిగా తొలగి సినిమా థియేటర్లు రీ ఓపెన్ కాగానే ఈ సినిమా వెండితెరపై ప్రదర్శించేందుకు సిద్ధం చేయాలని ప్రయత్నిస్తున్నారు.

వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో పూర్తయి రిలీజ్ కావాల్సి వుంది, కాని లాక్ డౌన్ కారణంగా కొంత షూటింగ్ పార్ట్ మిగిలిపోయింది. ఇప్పుడు పరిస్థితులు కాస్త కుదుట పడటంతో షూటింగ్ రీస్టార్ట్ చేసింది టీమ్. దీంతో అఖిల్, పూజా హెగ్డేలు ఇద్దరూ షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

అన్నీకుదిరితే సంక్రాంతి కానుకగా అభిమానులు ఈ సినిమా చూడొచ్చు. ఏదేమైనా కరోనా సంక్షోభ సమయంలో ధైర్యం చేసి ముందడుగు వేసిన అక్కినేని ఫ్యామిలీ హీరోలను అభినందించాల్సిందే!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here