గూగుల్ ప్లే స్టోర్ నుంచి Paytm అవుట్..

51
374

ప్రముఖ భారతీయ ఆర్థిక సేవల యాప్ Paytm ను గూగుల్ ప్లే స్టోర్ నుండి తీసివేవారు. తమ గ్యాంబ్లింగ్ పాలసీని Paytm ఉల్లంఘించిందంటూ గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది.

Paytm దేశంలోనే అత్యంత విలువైన స్టార్టప్. ఇది ఐదు కోట్ల మందికి పైగా నెలవారీ యాక్టివ్ వినియోగదారులను క్లెయిమ్ చేస్తుంది. భారతదేశంలో గూగుల్ పేతో పోటీపడుతున్న ఈ యాప్ నేటి నుంచి (శుక్రవారం) దేశంలోని ప్లే స్టోర్ నుంచి మాయమైంది.

భారత్ లో స్పోర్ట్స్ బెట్టింగ్‌లను సులభం చేసే ఆన్‌లైన్ కాసినోలు, క్రమ బద్ధీకరించని ఇతర గ్యాంబ్లింగ్ యాప్ లను ప్లే స్టోర్ నిషేధిస్తుందని గూగుల్ తెలిపింది. ఫాంటసీ స్పోర్ట్స్ సేవలను ప్రోత్సహించిన పేటీఎం యాప్ , ప్లే స్టోర్ విధానాలను పదేపదే ఉల్లంఘించిందని, ఈ విషయం తెలిసిన ఇద్దరు వ్యక్తులు టెక్ క్రంచ్‌కు చెప్పారని గూగుల్రు పేర్కొంది.

Paytm ఫాంటసీ స్పోర్ట్స్ సర్వీస్ ని Paytm ఫస్ట్ గేమ్స్ అని కూడా పిలుస్తారు. స్వతంత్ర యాప్ గా అందుబాటులో ఉన్న దీనిని కూడా ప్లే స్టోర్ నుంచి తీసేశారు. ప్రస్తుతం దేశంలోని పేమెంట్ మార్కెట్లో గూగుల్ పే ఆధిపత్యం చెలాయిస్తోంది. దేశంలో స్మార్ట్ ఫోన్ మార్కెట్ వాటాలో 99% ని ఆండ్రాయిడ్ కమాండ్ చేస్తోంది.

గూగుల్ నిర్ణయం వెలువడిన వెంటనే పేటీఎమ్ ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో ప్రియమైన వనియోగదారులారా… పేటీఎమ్ ఆండ్రాయిడ్ యాప్ క్రొత్త డౌన్‌లోడ్‌లు, అప్ డేట్స్ గూగుల్ ప్లే స్టోర్ లో తాత్కాలికంగా అందుబాటులో లేవు.త్వరలోనే తిరిగి వస్తుంది. మీ డబ్బు పూర్తిగా సురక్షితం, మీరు మీ పేటీఎమ్ యాప్ ని యదావిదిగా కొనసాగించవచ్చ ని తెలిపింది.

51 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here