చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

2
176

చిత్తూరు జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం వేగంగా వస్తున్న కారు బైకుతో పాటు పక్కనే ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మరణించగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల ప్రకారం.. బంగారుపాలెం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రోడ్డు క్రాస్‌ చేస్తున్న బైకును వేగంగా వస్తున్న కారు వెనుక నుండి ఢీ కొట్టింది. అనంతరం రహదారి పక్కనే ఉన్న లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైకుపై వెళ్తున్న వ్యక్తితో పాటు కారులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here