బిగ్ బాస్ 4 లో డేత్తడి పిల్ల హారిక..?

3
212

రోనా కాలంలో రెండు తెలుగు రాష్ట్రాలలో బిగ్ బాస్ ఫీవర్ పీక్ కి చేరింది. బిగ్‌బాస్‌ సీజన్ 4 లో ఎవరెవరు హౌప్ లోకి వెళతారన్నా దానికి కొద్ది రోజులు నుంచి ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో కొందరి పేర్లు కన్ ఫాం అయినట్టు సోషల్ మీడియాలో తాజాగా చక్కర్లు కొడుతున్నాయి. వారిలో డేత్తడి పిల్ల హారిక కూడా ఉంది. అదే నిజమైతే, తన వీడియోలతో తెలంగాణ యాసతో యూ ట్యూబ్ లో లొల్లి లొల్లి చేసే ఈ పిల్ల బిగ్ బాస్ హౌప్ లో ఎంత లొల్లి చేస్తుందో చూడాలి.

మరికొద్ది గంటల్లో బుల్లితెరపై బిగ్‌బాస్‌ సందడి చేయబోతున్నాడు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి. కింగ్‌ నాగార్జున హోస్ట్‌గా 15 మంది కంటెస్టెంట్స్‌ 100 రోజుల పాటు సందడి చేయబోతున్నారు. రేపటి నుంచి అంటే ..ఆది వారం నుంచి బిగ్‌బాస్‌ 4 ప్రసారం మొదలవుతుంది. క్వారంటైన్‌ పూర్తి చేసుకున్న కంటెస్టెంట్స్‌ అంతా సెప్టెంబర్‌ 3వ తేదీన హౌప్ లో ప్రవేశించారు. శుక్రవారం నుంచి షూటింగ్‌ మొదలైంది. అంటే ఆల్రెడీ ఆట మొదలైనట్టే.

ఇప్పటికే బిగ్‌బాస్‌ -4లో పాల్గొనేది వీళ్లేనంటూ సోషల్ మీడియాలో కొందరి పేర్లు బాగా వినిపించాయి. అయితే వాటిని కొందరు కొట్టిపడేశారు. ఇప్పటికే బిగ్‌బాస్‌-4లో తాము నటించడం లేదంటూ హీరో తరుణ్‌, హీరోయిన్‌ శ్రద్ధాదాస్‌, కల్పిక గణేశ్, నటి సునైనా, సింగర్‌ సునీత వంటి వారు క్లారిటీ ఇచ్చారు. అయితే తాజాగా మరో లిస్ట్‌ ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. బిగ్‌బాస్‌-4 కంటెస్టెంట్స్‌ పక్కా వీళ్లే అంటూ 15 మంది పేర్లు సోషల్‌ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్‌ అవుతున్నాయి. అయితే వారు ఎవరెవరన్నది రేపు బిగ్ బాస్ హౌస్ లో చూడాల్సిందే.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here