ఐదు గంటల పాటు సాగిన దీపిక పడుకోన్ విచారణ ..ఏం చెప్పింది?

0
180

న మేనేజర్ కరిష్మా ప్రకాష్‌తో డ్రగ్ చాట్‌లకు సంబంధించి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నటి దీపికా పదుకోన్ ను దాదాపు ఐదు గంటల పాటు విచారించింది. విచారణ అనంతరం కార్యాలయం నుంచి వెళ్లిపోయింది. ఆమె ఈ ఉదయం 9.45 గంటలకు ఎన్‌సిబి కార్యాలయానికి చేరుకుని సాయంత్రం నాలుగు గంటల వరకు అక్కడే ఉన్నారు. విచారణలో ఆమె పలు సంచలన విషయాలు చెప్పినట్టు తెలుస్తోంది. అయితే పలు ప్రశ్నలకు దీపిక ఇచ్చిన సమాధానాలు సంతృప్తికరంగా లేవని ఎన్సీబీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. కొన్నటికి మాత్రమే ఆమె సరిగా సమాధానాలు చెప్పినట్టు తెలుస్తోంది. దాంతో ఆమెను మరోమారు విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నటుడు సుశాంత్ సింగ్ మృతి కేసులో డ్రగ్స్ లింకుపై ఎన్సీబీ లోతుగా విచారిస్తోంది. ఇప్పటి వరకు రకుల్ ప్రీత్ సింగ్‌ను ప్రశ్నించింది. ఈ రోజు ఈ కేసు విచారణకు దీపిక, శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్ హాజరయ్యారు. ఉదయమే ఎన్సీబీ కార్యాలయానికి చేరుకున్న దీపిక శ్రద్ధా, సారా అలీ ఖాన్‌లను ఎన్సీబీ విచారిస్తోంది. దీపికకు, కరిష్మా మధ్య చాటింగ్‌పై ప్రశ్నిస్తున్న ఎన్సీబీ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. కరిష్మాతో సాధారణ సంబంధాలు తప్ప డ్రగ్స్ సంబంధాలు లేవని దీపిక పదుకోన్ ఎన్సీబీ అధికారులకు చెప్పినట్టు తెలుస్తోంది.

మరోవైపు, 2019 లో కరణ్ జోహర్ ఇచ్చిన పార్టీపై ఎన్సీబీ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఈ పార్టీలో పాల్గొన్న పలువురు డ్రగ్స్ తీసుకున్నట్టు విచారణకు హాజరైన శ్రద్ధా కపూర్ చెప్పడంతో.. ఈ పార్టీలో ఇంకా ఎవరెవరు ఉన్నారనే దానిపై ఎన్సీబీ ఫోకస్ చేస్తోంది. కరణ్ జోహర్‌కు చెందిన ధర్మా ప్రొడక్షన్స్ మాజీ ఉద్యోగి క్షిత్జీ ప్రసాద్‌ను ఎన్సీబీ ఈ కేసులో అరెస్ట్ చేసింది. దాంతో కరణ్ జోహర్‌కు సైతం నోటీసులు ఇచ్చే యోచనలో ఎన్సీబీ ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

https://twitter.com/ANI/status/1309801880642490373

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here