అవుతావు రాహుల్ అవుతావు..ఏదో ఒక రోజు నువ్వు పీఎం అవుతావు..!సోషల్ మీడియాలో దీపిక పాత వీడియో హల్ చల్

0
161

సుశాంత్‌ సింగ్‌ అనుమానాస్పద మృతి అనంతరం వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో ఎన్‌సీబీ విచారణ ప్రక్రియను వేగవంతం చేసింది. దీనిలో భాగంగానే నటీమణులు రకుల్‌ ప్రీత్‌సింగ్‌, దీపిక పదుకొనె, సారా అలీఖాన్‌, శ్రద్ధా కపూర్‌లను విచారించింది. వీరి నుంచి కీలకమైన సమాచారాన్ని అధికారులు రాబట్టినట్టు తెలుస్తోంది.

ఇదిలావుంటే, దీపిక పదుకొనెను విచారించిన సందర్భంలొ ఆమెకు సంబంధించిన పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో రాహుల్‌ గాంధీసై ఆమె ప్రశంసలు కురిపించటమే దీనికి కారణం. ఓ జాతీయ మీడియా గతంలో నిర్వహించిన ఇంటర్య్వూలో రాహుల్‌ గొప్ప నాయకుడు అటూ దీపికి పొగడ్తలలో ముంచేసింది. భవిష్యత్‌లో అతను దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు నిండుగా ఉన్నాయని, తనకు ఇష్టమైన నేతల్లో రాహుల్‌ ముందుంటారని చెప్పుకొచ్చింది. పాత వీడియో అయినప్పటికీ నెటిజన్లు దీనిపై విపరీతంగా స్పందించటం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here