వాస్తవాధీన రేఖ వెంట మూడు బెటాలియన్ల చైనా సైన్యం

1
163

డఖ్‌లోని వాస్తవాధీన రేఖ (ఎల్‌ఐసి) వద్ద భారతీయ, చైనా దళాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల మధ్య, డ్రాగన్ తన సైనికులను ఎల్‌ఐసి సమీపంలో పెద్ద సంఖ్యలో మోహరిస్తోంది. రెండు రోజుల క్రితం, సెప్టెంబర్ 7న చుషుల్‌లోని ముఖ్రి ప్రాంతంలోకి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్‌ఎ) చొచ్చుకు రావటాన్ని భారత సైన్యం విజయవంతంగా అడ్డుకుంది. ఐతే, రాబోయే రోజుల్లో చైనా నుండి ఇలాంటి మరిన్ని చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని బావిస్తున్నారు.

సెప్టెంబర్ 1 న, చైనా ఎల్‌ఐసి వద్ద రెచిన్ లా సమీపంలో పిఎల్‌ఎ గ్రౌండ్ ఫోర్స్ బెటాలియన్‌ను మోహరించింది. స్పాంగూర్ సరస్సు సమీపంలో మరో రెండు బెటాలియన్లను కూడా మోహరించింది. ఇవన్నీ శిక్వాన్ వద్ద ఉన్న 62 కంబైన్డ్ ఆర్మ్స్ బ్రిగేడ్‌లో భాగం.

ఆగస్టు 29-30 తేదీలలో రెచిన్ లా మరియు రెజాంగ్ లాలను స్వాధీనం చేసు కోవడంలో భారత సైన్యం విజయవంతమైందని గమనించాలి. ఇకపై, చైనా మోల్డో కంటోన్మెంట్ పై కూడా భారత సైన్యం ఓ కన్నేసి ఉంచాలి. అలాగే పిఎల్ఎ దళాలు ఇప్పుడు వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన ఈ శిఖరాలను తిరిగి ఆక్రమించుకునే అవకాశాల కోసం చూస్తున్నాయి.

లడఖ్‌లో చైనా రెండు మోటరైజ్డ్ డివిజన్లను మోహరించింది. 4 వ మోటరైజ్డ్ డివిజన్ చుషుల్ కు అభిముఖంగా మోహరించింది. 6 వ మోటరైజ్డ్ డివిజన్ పాంగోంగ్ పశ్చిమం నుంచ దౌలత్ బేగ్ ఓల్డి వరకు ఉంది. ఇది కాకుండా, 4 మోటరైజ్డ్ డివిజన్ ట్యాంకుల బెటాలియన్లు స్పాంగూర్ గ్యాప్ చుట్టూ సొజీషన్ లో ఉన్నాయి.

మరోవైపు, చైనా దళాల నుండి పెద్ద దాడి జరిగే అవకాశం ఉన్నందున వాస్తవాధీన రేఖ పొడవునా భారత సైన్యం ట్యాంకులు, సాయుధ వాహనాలను మోహరించింది. ఈ ప్రాంతంలో విశాలమైన మైదానాలు ఉన్నాయి. ఇవి ట్యాంకులు, సాయుధ వాహనాలకు అఅనుకూలమైనవి. కాబట్టి ఇరు దేశాల సైన్యాలు ఇక్కడి నుండి పెద్ద ఎత్తున దాడి చేగయలవు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here