ఉద్ధవ్ సర్కార్ ని కూల్చటానికి అధికారుల కుట్ర?

0
158

హరాష్ట్రలో ఏం జరుగుతోంది. అధికారులే ప్రభుత్వాన్ని కూల్చే పనిలో ఉన్నారా? తెరవెనక బీజేపీ అంతా నడిపిస్తోందా? శివసేన పత్రిక సామ్నా ఈ మాటే అంటోంది.

శివసేన అధికారిక పత్రిక సామ్నా అధికారులపై సంచలన ఆరోపణలు చేసింది. ప్రభుత్వంలోని కొందరు అధికారులు శివసేన ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తున్నారని పేర్కొంది. అధికారుల్లో కొందరు శత్రువు లుగా మారి, బీజేపీతో కుమ్మక్కై, తమ ప్రభుత్వాన్ని గద్దె దించాలని కుట్రలు పన్నుతున్నారని సామ్నా వేదికగా శివసేన మండిపడింది.

మహారాష్ట్రలో ఇంకా ఫడ్నవీస్ ప్రభుత్వమే ఉందని కొందరు అధికారులు భ్రమల్లో ఉన్నారని. ప్రభుత్వం లో కీలక శాఖలతో పాటు, పోలీసు కమిషనర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ల లాంటి కీలకమైన వారి అపాయిం ట్‌మెంట్లను ఆరెస్సెస్ ప్రభావితం చేస్తోందని సామ్నా వేదికగా శివసేన ఆరోపించింది.

అయితే… తమ ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్ర పన్నుతున్న అధికారుల వివరాలు ప్రస్తుతం చెప్పలేమని, కానీ… తమ ప్రభుత్వాన్ని కూల్చాలని మాత్రం కొందరు అధికారులు ఆలోచిస్తున్నారని శివసేన ఆరోపించింది. పాత సీఎం దృష్టిలో బాగుగా అనిపించుకోడానికి స్వతంత్ర ఎమ్మెల్యేలను, చిన్న పార్టీలను కూడా అధికారులు బెదిరించారని ఈ వ్యాసంలో ఆరోపించింది.

బీజేపీ మెజారిటీని నిరూపించే బాధ్యత తమ భుజ స్కంధాలపైనే మోస్తున్నట్లు అధికారుల తీరు ఉందని విమర్శించింది. అధికారుల సహాయంతో ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఎవరైనా భావిస్తే అది వారి మూర్ఖత్వమే అవుతుందని మండిపడింది.

అయితే సామ్నాలో పేర్కొన్నట్టు శివసేన భయాలు నిజమే అనిపిస్తుంది. మధ్యప్రదేశ్, కర్నాటకలో బీజేపీ ఏం చేసిందో దేశం చూసింది. ఇప్పడు మహారాష్ట్రలో కూడా అలాంటిదేదో జరుగుతుందని శివసేన అప్రమత్తమైంది. బహుశా ఈ వ్యాసం ద్వారా ఆ అధికారులకు ఓ హెచ్చరిక చేసినట్టుగా అనుకోవచ్చు. ప్రస్తుతం మహారాష్ర్ట అసెంబ్లీలో 105 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ అతి పెద్ద పార్టీగా ఉంది.

సామ్నా పత్రిక తరచూ సంచలన వ్యాఖ్యలు చేస్తుంటుంది. మహారాష్ట్ర నుంచి ముంబైని వేరుచేసే కుట్ర జరుగుతోందని శివసేన ఆరోపించింది. కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తున్నదని ఈ నెల మొద ట్లో విమర్శించింది.

మొదట మహారాష్ట్ర, ముంబైని పాక్ ఆక్రమితక కశ్మీర్‌తో పోల్చేలా చేసి పరువు తీయడంపై కేంద్రం దృష్టిసారించిందని మండిపడింది. తద్వారా రాష్ట్రాన్ని బలహీనపరిచి దివాళా దిశకు తీసుకెళ్లేందుకు కుట్రపన్నుతున్నదని ఆరోపించింది. అందుకే కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోకుండా రాష్ట్ర ప్రభుత్వంపై దాడి చేస్తున్నదని దుయ్యబట్టింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here