బిగ్ బాస్ ఎంట్రీ మామూలుగా లేదు…

3
180

చాలా రోజులుగా ఊరిస్తూ వచ్చిన బిగ్ బాస్ మళ్లీ మీ ముందుకు వచ్చాడు. బిగ్ బాస్ సీజన్ 4 ఈ సాయంత్రం అట్టహాసంగా మొదలైంది. ‘మాస్క్ ముఖానికి.. ఎంటర్ టైన్మెంట్‌కి కాదు’అంటూ ప్రీమియర్ టీజర్‌తో కింగ్ నాగార్జున గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. గత మూడు సీజన్లలో బిగ్ బాస్ లు మారారు. బిగ్ బాస్1 నాగార్జున, బిగ్ బాస్ 2 జూనియర్ ఎన్టీయార్, బిగ్ బాస్ 3 నాని. మళ్లీ ఈ సారి తెలుగు తెర మన్మథుడు బిగ్ బాస్ గా టీవీ ప్రేక్షకులను అలరించనున్నారు. స్టార్ మాలో ప్రసారమయ్యే ఈ రియాలిటీ షోకు ఈ సారి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. కారోనా వల్ల కొత్త సినిమాలు లేక తెరమీద హీరోల ముఖం చూసి చాలా రోజులైంది. బిగ్ బాస్ 4 తో తెలుగు ప్రేక్షకులకు ఆ కరువు తీరనుంది. ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ స్టార్ మా, హాట్ స్టార్‌లలో బిగ్ బాస్ సీజన్ 4 తొలి ఎపిసోడ్ ప్రారంభమవుతుంది. శని ఆది వారాల్లో రాత్రి 9 గంటలకు ప్రసారం కానుండగా.. మిగిలిన సోమవారం-శుక్రవారం వరకూ రాత్రి 9.30 గంటలకు బిగ్ బాస్ ఆట ప్రసారం కాబోతుంది. ఎప్పటిలాగే శని-ఆది వారాల్లో మాత్రమే నాగార్జున కనిపించబోతున్నారు.


ఐదుగురు హౌస్ మేట్స్ హౌస్ లోకి అడుగుపెట్టారు. తొలి హౌస్మేట్‌గా హీరోయిన్ మోనాల్ గజ్జర్, రెండో హౌస్ మెట్ గా దర్శకుడు సూర్య కిరణ్, మూడో కంటె స్టంట్ గా ప్రముఖ యాంకర్ లయ, నాలుగో కంటెస్టంట్ గా నటుడు అభిజిత్ హౌస్ లోకి అడుగుపెట్టారు. ఐదో హౌస్ మేట్ గా జోర్దార్ సుజాత హౌస్ లోకి అడుగుపెట్టారు. నాగార్జున ను బిట్టూ అంటూ సంబోధించి.. బిగ్ బాస్ కార్యక్రమానికి జోర్దార్ ఎంట్రీ ఇచ్చారు సుజాత.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here