కరోనా వచ్చిన మహిళకు మళ్లీ కరోనా…

1
149

బెంగళూరులో మొట్ట మొదటి కరోనావైరస్ రీఇన్ఫెక్షన్ కేసు నమోదైంది. జూలైలో కోవిడ్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చిన 27 ఏళ్ల మహిళ పూర్తిగా కోలుకున్న తరువాత హాస్సిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అప్పుడు నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆమెకు ఎటువంటి ఇతర అనారోగ్యాలు లేవని తేలింది. అయితే ఆమెలో కరోనా రోగనిరోధక శక్తి పెరగలేదు. ఈ విషయం ఆమెకు ట్రీట్ మెంట్ అందిస్తున్న ఫోర్టిస్ హాస్పిటల్ ఒక ప్రకటనలో పేర్కొంది. బహుశా బెంగుళూరులో ఇది మొదటి కోవిడ్ రీఇన్ఫెక్షన్ టి కేసు కావచ్చని ఆస్పత్రి వైద్యులు అంటున్నారు. ఒక నెల వ్యవధిలో రెండవసారి ఆమెలో ఈ వ్యాధి ఎలా అభివృద్ధి అయిందో ఈ కేసు ద్వారా తెలుస్తోందని అంటున్నారు.


సాధారణంగా, ఇన్ఫెక్షన్ అయిన 2-3 వారాల తర్వాత కోవిడ్ ఇమ్యునోగ్లోబులిన్ జి యాంటీబాడీ పరీక్ష పాజిటివ్ గా వస్తుంది (రోగి కోవిడ్-ఫైటింగ్ కణాలను అభివృద్ధి చేసినట్లు చూపిస్తుంది). అయితే, ఈ రోగిలో, యాంటీబాడీ పరీక్ష నెగెటివ్ వచ్చింది. అంటే మొదటి ఇన్ఫెక్షన్ తర్వాత ఆమె రోగనిరోధక శక్తిని పెంచుకోలేదని అర్థమవుతోంది. అయితే ఒక నెలలో యాంటీబాడీలు అదృశ్యమయ్యే అవకాశం కూడా ఉంది. ఫలితంగా ఆమె తిరిగి ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశం ఉందని ఆస్పత్రి వైద్యులు అంటున్నారు. అయితే రీఇన్ఫెక్షన్ తరువాత ఆమె కరోనా లక్షణాలు అంతగా కనిపించలేదు. రీఇన్ఫెక్షన్ అంటేనే యాంటీబాడీస్ ఉత్పత్తి కాలేదని అర్థం. ఒకవేళ అవి అభివృద్ధి చెందినా అవి ఎక్కువసేపు ఉండకపోవచ్చు. అందువల్ల వైరస్ శరీరంలోకి ప్రవేశించి వ్యాధికి మళ్లీ కారణమవుతుందని డాక్టర్లు వివరించారు.


ఆసియాలో అత్యంత ఘోరంగా కారోనా భారినపడ్డ దేశం మనదే. రోజు రోజుకు కేసులు పెరుగుతూనే ఉన్నందున కోవిడ్ 19 మహమ్మారిని అడ్డుకోవటం, దానిని అంతం చేయడం అంత సులభం కాదని ఇలాంటి కేసుల ద్వారా అర్థమవుతుంది. శనివారం ఒక్క రోజే 90,000కు పైగా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసులు 41 లక్షల మార్కును దాటిపోయాయి. మనదేశంతో పాటు హాంకాంగ్, యుఎస్, నెదర్లాండ్స్ , బెల్జియంతో సహా పలు ఇతర దేశాలలో కూడా రీఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here