అఖిల్ పెళ్లి పనుల్లో సమంత బిజీ..?

0
146

క్కినేని వారి ఇంట త్వరలోనే పెళ్లిబాజాలు మోగనున్నాయి. అఖిల్ అక్కినేని పెళ్లి ఫిక్స్ అయిపో యిందని, ఓ వ్యాపారవేత్త కుమార్తెను పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అఖిల్ పెళ్లి బాధ్యతలను.. వదిన సమంత తీసుకుందట. ఆమె ఇప్పటికే ఆ పనుల్లో బిజీగా ఉందని సమాచారం. దీనికి సంబందించిన ప్రకటన త్వరలోనే వెలువడనుందని బావిస్తున్నారు. గతంలో అఖి ల్‌‌కు శ్రేయాభూపాల్ తో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఏవో కారణాల కారణంగా ఊహిం చని విధంగా వారి పెళ్లి ఆగిపోయింది. తరువాత శ్రేయాభూపాల్ వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అఖిల్ మాత్రం ఇంకా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గానే మిగిలిపోయారు.

వీలైనంత తొందరగా అఖిల్ పెళ్లి చేయాలని ఆయన తల్లిదండ్రులు అమల, నాగార్జున బావిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే సదరు వ్యాపారవేత్తతో అక్కినేని కుటుంబం చర్చించినట్టు తెలుస్తోంది. అఖిల్ పెళ్లి కథ మొత్తం సమంతే నడిపిస్తున్నట్టు సమాచారం. అయితే అఖిల్ పెళ్లిపై అక్కినేని కుటుం బం ఇప్పటివరకు స్పందించలేదు. చూడాలి రేపో మాపో స్పందిస్తుందేమో!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here