ఇన్ స్టాలో సాయిపల్లవి లవ్ స్టోరీ!

0
132


ఫిదా హీరోయిన్ సాయి పల్లవి అప్పుడప్పుడు ప్రకృతి వొడిలో సేదతీరుతుంటుంది. శేఖర్ కమ్ముల లవ్‌స్టోరీ షూటింగ్‌లోనాగచైతన్యతో కలిసి పాల్గొంటున్న సాయిపల్లవి తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటో పోస్ట్ చేసింది.ప్రకృతి ఒడిలో, చల్లటి గాలిలోసేదతీరుతున్న తన ఫొటోను పోస్ట్ చేసింది. ఈ ఫొటోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రకృతి పట్ల ఆమె ప్రేమను మెచ్చుకుంటున్నారు.

సాయి పల్లవి నటన నేచురల్ గా ఉంటుంది. చేసింది కొన్ని సినిమాలే అయినా దక్షిణాదిలో ఓ భిన్న మైన హీరోయిన్ గా పేరు తెచ్చకుంది. నటనతో పాటు నాట్యంలో కూడా మంచి టాలెంట్ ఉన్న నటి. అందుకే సాయిపల్లవికి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. పాత్ర తనకు నచ్చకపోతే ఎంత పెద్ద డైరెక్టర్‌కైనా నో చెప్పేస్తుంది. కొన్ని కోట్లు ఇస్తామన్నా వాణిజ్య ప్రకటనలలో నటించడానికిఅంగీకరించదు. భారీ అభిమానగణం ఉన్నా సాదా సీదాగా ఉండడానికే ఇష్టపడుతుంది ఈ డాక్టర్ కమ్ యాక్టర్..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here