17 మంది ఎంపీలకు కారోనా పాజిటివ్!

0
131

ఉదయం పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనందునసభ్యులకు విధిగా కరోనా పరీక్షలు నిర్వహించారు. దాంతో 17 మంది లోక్ సభ సభ్యులకు కరోనా పాజిటివ్ అని తేలినట్టు తెలిసింది. వారి లో 12 మంది బిజెపికి చెందిన వారేనని సమాచారం. కాగా వైయస్ఆర్ కాంగ్రెస్ కు చెందిన ఇద్దరు ఎంపీ లు, శివసేన, డిఎంకె , ఆర్ఎల్పి కి చెందిన ఒక్కో సభ్యునికి కోవిడ్ పాజిటివ్ అని తేలింది.

లోక్‌సభ సభ్యు లకు సెప్టెంబర్ 13, 14 తేదీల్లో పార్లమెంట్ హౌస్‌లో ఈ పరీక్షలు నిర్వహించినట్ట పార్లమెంట్ వర్గాలు తెలిపాయి. కరోనా సోకిన ఎంపీలలో ఒకరైన బిజెపికి చెందిన సుకాంత మజుందార్ నిన్న తన కోవిడ్ పాజిటివ్ గురించి ట్వీట్ చేశారు. “గత కొద్ది రోజులుగా నాతో సన్నిహితంగా ఉన్న వారందరి ఆరోగ్యాన్ని పర్యవేక్షించాలని, అలాగే ఏవైనా లక్షణాలు ఉంటే పరీక్షలు చేయమని అభ్యర్థిస్తున్నాను” అని ఆయన ట్వీట్ చేశారు.

785 మంది ఎంపీలలో 200 మంది 65 ఏళ్లు పైబడిన వారున్నారు. వారికే కరోనా మహమ్మారి బారిన పడే అవకాశాలు ఎక్కువ. ఇంతకుముందు కనీసం ఏడుగురు కేంద్ర మంత్రులు, 25 మంది ఎంపీలు, ఎ మ్మెల్యేలు ఈ వ్యాధి బారిన పడ్డారు. వారిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఉన్నారు, పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యే ముందు పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కాగా ఇప్పటి కే ఓ ఎంపీ, పలువురు ఎమ్మెల్యేలు మహమ్మాకి బారినపడి మరణించారు. కోవిడ్ నేపథ్యంలో కట్టు దిట్ట మైన చర్యల మధ్య పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి. సెషన్ రంభమవుతున్నందున సభ్యులందరూ కోవిడ్ -19 పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here