అగ్రహార సెంట్రల్‌ జైలుకు నటి రాగిణి

88
460

డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి పది రోజుల క్రితం అరెస్టయిన ప్రముఖ కన్నడ నటి రాగిణి ద్వివేదికి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. దీంతో ఆమెను బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్‌ జైలుకు తరలించారు. రాగిణితో పాటు శాండల్‌వుడ్‌ డ్రగ్స్‌ వ్యవహారంలో అరెస్టయిన మరో నటి సంజన గల్రాని, రాహుల్, ప్రశాంత్‌ రంకా, లూమ్‌ పెప్పర్, నియాజ్‌లను వీడియో కాన్ఫరెన్స్‌లో కోర్టులో హాజరు పరిచారు. సంజనకు మినహా మిగతా వారికి 14 రోజుల రిమాండ్‌ విధించారు. నటి సంజనకు 16వ తేదీ వరకు సీసీబీ కస్టడీని పొడిగించారు. సంజనను మరింతగా ప్రశ్నించాల్సి ఉన్నందున కస్టడీని పొడిగించినట్లు సీసీబీ పోలీసులు తెలిపారు.

88 COMMENTS

  1. Hi, Neat post. There is a problem with your website in web explorer, could check this… IE still is the market leader and a good portion of folks will pass over your fantastic writing because of this problem.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here